
సమస్యలు పరిష్కరించాలని వినతి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిషత్ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు కోరారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ రవికుమార్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం మాట్లాడుతూ జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలల పరిధిలో ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్‌మన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పీఎఫ్ వార్షిక స్లిప్స్‌ను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని చెప్పారు. పీఎఫ్ సమస్యల పరిష్కారానికి వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలన్నారు. అంతర్ జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ిపీఎఫ్ కు సంబంధించిన ట్రాన్స్‌ఫర్, అకౌంట్ బదిలీ సమస్యలను తొలగించాలన్నారు. కారుణ్య నియామకలను నెలవారీగా సమీక్షించి ఎప్పటికప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలన్నారు. పీఎఫ్ రుణాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం కాకుండా మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు రామ్మూర్తి, సుబ్రహ్మణ్యం, మహేష్, షణ్ముగం, అరుణ్‌కుమార్, జిల్లా కార్యదర్శులు దేవరాజులు, కుమార్, చలపతి పాల్గొన్నారు.
13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పులిచెర్ల(కల్లూరు): వాహనం సహా 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. వారిక కథనం మేరకు.. ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందుగా సమాచారం అందడంతో కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఏపీ03–ఎస్3713 నంబరు గల మారుతీ సుజికీలో 13 ఎర్రచదనం దుంగలు, ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆపై నిందితులను అదుపులోకి తీసుకుని, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు తమిళనాడు రాష్ట్రం, కళువకుచ్చి జిల్లా, కళువరాయ్‌మలైకి చెందిన ఏలుమలై, సెంథిల్, అన్‌బలగన్, రామన్, అన్నాదొరై, కుప్పస్వామి, మణిగా గుర్తించారు. ఎర్రచందనం దుంగలతోపాటు వాహనం విలువ రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. దాడుల్లో స్క్వాడ్ డీఎఫ్‌ఓ గురుప్రభాకర్, ఎఫ్‌ఆర్‌ఓ ఎస్.చంద్రశేఖర్, ఎఫ్‌బీఓ ప్రకాష్‌కుమార్, ఎఫ్‌బీఓ కే.ప్రతాప్, రెడ్డిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి