
నమ్మకానికి ప్రతీక భారతి అల్ట్రా ఫాస్ట్
గుడిపాల: నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. శుక్రవారం గుడిపాల మండలంలోని నరహరిపేట సమీపంలో కృష్ణా ట్రేడర్స్ రవి ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ ఛాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భార తి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంఫర్ ఫ్రూప్ బస్తాలతో మా ర్కెట్‌లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవ కాశం కూడా ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం భారతి సిమెంట్‌కు సంబంధించిన నాణ్య తా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మా ణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం తాఫీ మేస్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందజేశారు.