
సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : తోతాపురి మామిడికి ప్రభుత్వం అందజేసే సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చర్య లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తోతాపురి మా మిడి రైతులకు రూ.4ను ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదా పు మూడు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురిని పరిశ్రమల నిర్వాహకులు కొనుగోలు చేశారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.4 సబ్సిడీ మొత్తం రూ.120 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 30,500 మెట్రిక్ ట న్నుల వేరుశనగ విత్తనాలు వచ్చినట్టు తెలిపారు.