
సన్నిధి వినాయకస్వామి ఆలయంలో చోరీ
నగరి : పట్టణంలోని బేరివీధిలో ఉన్న సన్ని ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. హుండీ తాళా లు పగులగొట్టి చోరీ చేయడంతోపాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. శనివారం ఉదయం యథావిధిగా పూజలు చేయడానికి అర్చకుడు ఆలయానికి వచ్చాడు. అక్కడ హుండీ, సీసీ కెమెరాలు పగులగొట్టి ఉండడం చూసి, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ విక్రమ్ ఆదేశాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆలయానికి సమీపంగా ఉన్న నివాసాల ముందు అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితుల ఆచూకీ ఆరా తీస్తామని సీఐ తెలిపారు.
మహిళ అదృశ్యం
గంగవరం: మండలంలోని కొత్తపల్లికి చెందిన సుబ్రమణ్యం రెడ్డి భార్య మునిరత్నమ్మ(61) నా లుగు రోజులుగా కనిపించకుండా పోయిందని ఆమె బంధువులు శనివారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.
బస్సును ఢీకొన్న
ఐచర్ వాహనం
బంగారుపాళెం : మండలంలోని మహాసముద్రం టోల్‌ప్లాజా వద్ద శనివారం బస్సును ఐచర్ వాహనం ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. అమరరాజా ఫ్యాక్టరీకి చెందిన బస్సు కార్మికులను తీసుకు వెళ్లేందుకు టోల్‌ప్లాజా వద్ద ఆగింది. అదే సమయంలో పలమనేరు నుంచి చిత్తూరు వెళుతున్న ఐచర్ వాహనం బస్సును వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఐచర్ వాహన డ్రైవర్ సలీంకు బలమైన గాయం తగలడంతో హైవే అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వరకట్నం కేసు నమోదు
పుంగనూరు (చౌడేపల్లె): అధిక కట్నం తేవాలని వివాహితను చిత్రహింసలకు గురి చేసిన నలు గురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ రుక్ష్మినందనాయుడు శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని నల్లగుట్లపల్లెకి చెందిన స్వప్నకుమారితో కేవీ పల్లె మండలం పెద్దతాండాకు చెందిన గోవిందనాయక్ కుమారుడు బాలాజీనాయక్‌తో గత రెండేళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొన్ని రోజులపాటు సజావుగా సాగి న ఈ కుటుంబంలో అధిక కట్నం చిచ్చురేపింది. నిత్యం అధికకట్నం రూ.5 లక్షలు తేవాలని వేధించిన భర్త బాలాజీనాయక్, మామ గోవిందనాయక్, శ్రీదేవి, నూర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

సన్నిధి వినాయకస్వామి ఆలయంలో చోరీ

సన్నిధి వినాయకస్వామి ఆలయంలో చోరీ