
రైతులను దండుపాళెం బ్యాచ్‌గా చిత్రీకరణపై ఆగ్రహం
● విలువలు పాటించకుండా కర్షకులపై వ్యతిరేక కథనాలు ● కూటమి సర్కార్‌కు తొత్తుగా మారిన పచ్చమీడియా ● మండిపడుతున్న అన్నదాతలు
రైతులను అవమానించడం దారుణం
బంగారుపాళెం సమావేశానికి వెళ్లిన వారు రైతు లు కాదు.. దండుపాళెం బ్యాచ్ అంటూ ఓ పత్రిక లో వార్త చూశా. ఓ రైతు గా మనసులో చాలా బాధేసింది. పదిమందికి అన్నం పెట్టే రైతులంటే అందరికీ చులకన అయినట్టుంది. అన్నీ తెలిసి, బాగా చదువుకున్న వారే ఇలాంటి రాతలు రాయడం మంచిది కాదు. ఆ స్థానంలో మామిడి రైతే కాదు ఏ రైతున్నా ఒక్కటే కదా? ఎవరిపైనో కోపాన్ని రైతులపై చూపడం భావ్యం కాదు.
– గోవిందురెడ్డి, రైతు, బేరుపల్లి