
ఆగని గజదాడులు
పులిచర్ల మండంలో గజదాడులు ఆగడం లేదు. రోజుకో చోట పంటలపై దాడులు చేసి, ధ్వంసం చేస్తున్నాయి.
●
అది మంచి పద్ధతి కాదు
చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలో దండుపాళ్యెం బ్యాచ్ దాడులంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు రాయడాన్ని తప్పుపడుతున్నాం. పత్రికలంటే ఎంతో గౌరవం ఉంది. ఒక వేళ రాజకీయంగా మీకు అనుకూలంగా ఉన్న నాయకుడిపై మంచి కథనాలు రాసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే రైతులకు వ్యతిరేకంగా దండుపాళ్యెం బ్యాచ్ అంటూ కథనం ఇవ్వడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. – సుబ్రమణ్యం, రైతు,
జంగాలపల్లి, వెంకటగిరి రూరల్ మండలం
మంచి చెడులతో సంబంధం లేదు
చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలకు మంచి చెడులతో సంబంధం లేదు. రైతులు, పేదోడు అనే భావన లేదు. ఒకటే మార్గం చంద్రబాబు ఏమీ చేసినా అదే కరెక్ట్‌గా భావిస్తున్నారు. ఆయనపై ఒక కథనం చెడుగా ఇప్పటి వరకు ఆ పత్రికల్లో రాలేదు. అంటే సీఎం చంద్రబాబు వందశాతం మంచే చేస్తున్నారా? ప్రతి పక్షనేతపై ఒక్క మంచి కథనం ఇప్పటివరకు ఇవ్వలేదు. చివరికి దండుపాళ్యెం బ్యాచ్ అంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయమో తెలియడం లేదు.
– గుర్రం నాగిరెడ్డి, రైతు, ఆర్‌సీ పురం
దండుపాళెం బ్యాచ్‌తో పోల్చడం ఎంటీ ?
రైతులను ఎల్లో మీడియా దండుపాళెం బ్యాచ్‌తో పోల్చడం ఏమిటో తెలియడం లేదు. ఎంతో దారుణంగా కథనాలు రాస్తున్నా రు. చంద్రబాబును బతికించడానికే ఆ పత్రికలు పనిచేస్తున్నాయి. మామిడి రైతులు కష్టాల్లో ఉంటే వారిని పరామర్శించడానికి వచ్చిన వారిపై విషాన్ని చిమ్మడం ఎందుకో అర్ధం కావడం లేదు. పత్రిక విలువలు పూర్తిగా దిగజార్చి కథనాలు రాస్తున్నా యి. రైతులకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం.
– తిరుమల రెడ్డి, రైతు, కారూరు,
సూళ్లూరుపేట నియోజకవర్గం
– 8లో

ఆగని గజదాడులు

ఆగని గజదాడులు