
విధ్వంసక ‘కూటమి’ని ఎదుర్కొందాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అధికారం చేపట్టినప్పటి నుంచి విధ్వంసక పాలన సాగిస్తున్న ఈ మోసపూరితమైన ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు మండలం పాలంతోపు గ్రామంలో ఆదివారం ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధాలకు మారు పేరు చంద్రబాబు అన్నారు. బాబు మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చారని, తీరా ప్రజలకు చేసేంది ఏమిలేదన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, విధ్వంసాలకు పాల్పడ్డారని చెప్పారు. ఇళ్లు, ఆస్తులు, పంటలు ధ్వంసం చేసి సామాన్యులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల రక్తాన్ని కళ్లచూశారన్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ అరాచకాలు, తప్పుడు హామీలపై ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. ప్రతి గడపలోకి వెళ్లి కూటమి మోసాన్ని వివరిద్దామన్నారు. రైతులను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని బూచి చూపించి చివరకు నడి రోడ్డుపై వదిలేశారన్నారు. ఈ బాధలు తట్టుకోలేక ఓ రైతు మామిడి చెట్లు తొలగించి ప్రత్యామ్నాయం చూసుకుంటే ఆ రైతుకు అటవీశాఖ అధికారులు జరిమానా విధించడం విడ్డూరమన్నారు. ఇలా జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9న బంగారుపాళ్యంకు వస్తున్నారన్నారు. ఆయనకు జిల్లాలోని ప్రతి రైతు స్వాగతం పలకాలని కోరారు. అనంతరం క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయపాల్, జెడ్పీటీసీ ఎం.ఎస్‌బాబునాయుడు, నాయకులు సంపత్, అమర్‌నాథ్‌రెడ్డి, త్యాగరాజులు రామ్మోహన్, భాస్కర్‌రెడ్డి, భాస్కర్, వేలుస్వామి, రాబర్ట్, స్టాండ్లీ, దిలీప్, పాండి, రాజేంద్ర, సుబ్రమణి, జయచంద్ర, సుబ్రమణ్యం, మూర్తి, వైస్ ఎంపీపీ జయరాం పాల్గొన్నారు.