
రూ.6కు అంగీకార పత్రం
కూటమి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనలేమని ఫ్యాక్టరీలు చేతులెత్తేస్తున్నాయి. అందుకు నిదర్శనమే జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ ఇచ్చిన అంగీకార పత్రం నిదర్శనంగా నిలుస్తోంది. అందులో తోతాపురి కేజీ రూ.6కే విక్రయిస్తున్నామని రైతుల నుంచి సంతకాలు తీసుకుంటోంది. ఆ పత్రాలను కూడా బయటకు ఇవ్వకుండా, ఫొటోలు తీయనీకుండా అడ్డుకుంటోంది. అతి కష్టం మీద ఓ అంగీకార పత్రం బయటకు వచ్చింది. తద్వారా సూపర్‌సిక్స్ రేటు తెల్లతేటమైంది. ఇదీ కూడా ఒక మాయే నంటూ రైతులు పలువురు మండిపడుతున్నారు. పూతలపట్టులోని ఓ ఫ్యాక్టరీ రూ.5 చొప్పున్న చెల్లిస్తోందని, ఆ చెల్లింపులు బ్యాంకులో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తోతాపురి కేజీ రూ.8 చొప్పున్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.