
పోలీసుల ఓవర్‌యాక్షన్!
పలమనేరు: పోలీసులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎక్కడాలేని ఆంక్షలు పెట్టి ఓవర్‌యాక్షన్ చేశారు. పలమనేరు వైపు నుంచి ద్విచక్ర వాహనాలను సైతం పంపకుండా పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద అడ్డుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వాహనాన్ని ఆపారు. ఆపై మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆపై అక్కడున్న వారిని పోలీసులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటకు పంపారు.
పోలీసుల జులుం
పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు బంగారుపాళెం ఫ్‌లైవర్ నుంచి కాలినడకన వెళ్తుండగా అక్కడున్న పోలీసులు జనంపై లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలు సర్దిచెబుతున్నా లెక్కచేయలేదు. ఒకానొక సందర్భంలో పోలీసులపై ప్రజలు తిరగబడాల్సి వచ్చింది. ఎటూ చూసి నా జనాన్ని చూసిన పోలీసులు శత్రువులును చూసినట్టుగా అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పోలీసుల కవ్వింపుల కారణంగానే ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యారు.
బైక్‌ల తాళాలు లాక్కునీ..
రోడ్డుపై బైకులో వస్తున్న వందలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. తాము స్థానికులమని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. వారి బైక్ కీలను లాక్కొన్నారు. దీంతో జనం ఆగ్రహానికి గురయ్యారు. వైఎస్ జగన్ పర్యటక ముగిశాక సైతం మార్కెట్ నుంచి జనం బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లను వేసేశారు. దీంతో భయపడిన జనం గోడలు, గేట్లు దూకి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
సీఎం.. డౌన్‌డౌన్
కాణిపాకం: బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్ గేటు ఎదుట బుధవారం ఉదయం 10.30గంటల ప్రాంతంలో రైతులు, జగనన్న అభిమానులు రెండో గేటు ఎదుట ఆగ్రమానికి గురయ్యారు. లోపాలికి పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పట్టించుకోని పోలీసులతో విసిగిపోయిన వారు సీఎం డౌన్..సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు మిన్నంటించారు. ఆపై ఒక్కసారిగా వారంతా మొదటి గేటులో నుంచి మార్కెట్ లోపలకి దూసుకొచ్చారు. కొందరు మార్కెట్ ప్రహారీ గోడను ఎక్కి లోపలికి తరలివచ్చారు.
చిన్నారి పులకింత
కాణిపాకం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు, స్థానికులతో పాటు వృద్ధులు, చిన్నారులు కూడా వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. అందులో భాగంగా ఓ (చిత్తూరుకు చెందిన హోమ శైలుషా 7వ తరగతి) చిన్నారి తన భామతో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు రోడ్డుపై వేచి ఉంది. వీరిని గమనించిన జగన్‌మోహన్‌రెడ్డి తన కాన్వాయ్‌ని ఆపి వారిని దగ్గరకు పిలిచారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారిద్దరూ ఆనందంలో మునిగితేలారు.

పోలీసుల ఓవర్‌యాక్షన్!

పోలీసుల ఓవర్‌యాక్షన్!