
విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రిడ్జ్ కోర్సును బుధవారం ప్రారంభించారు. వర్సిటీలోని చెలికాని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, స్కూల్ ఆఫ్ దర్శన్ డీన్ ప్రొఫెసర్ విష్ణుభట్టాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్కృత భాషతోపాటు అందులో శాసీ్త్రయ అంశాలు, శాస్త్రాల సమగ్ర జ్ఞానాన్ని బ్రిడ్జ్ కోర్సులో అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, సహాయక ఆచార్యులు డాక్టర్ యశస్వి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా వీసీ కాన్ఫరెన్స్‌లో ఎన్‌ఎస్‌యూ వీసీ
తిరుపతి సిటీ : కర్ణాటకలోని ముద్దెనహలి, సత్యగ్రామ, సత్యసాయి ప్రేమామృతం వేదికగా జరిగిన ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్‌లో జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారత్ విశ్వగురువుగా వెలుగొందేందుకు తీసుకోవాల్సిన నూతన సంస్కరణలు, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ప్రోత్సహించడం, వర్సిటీల బలోపేతం తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చించారు.