
జన తరంగాన్ని ఎవరూ ఆపలేరు
చిత్తూరు అర్బన్: జప తరంగాన్ని ఎవరూ ఆపలేరని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించిన అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీనివాసులు, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ సోమవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథి గృహంలో ఎస్పీ మణికంఠతో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం కిలో మామిడికి కేంద్రం మెడలు వంచి రూ.16 చెల్లిస్తుంటే.. 20 మందికి పైగా ఎంపీలున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం రూ.8 కూడా రైతులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రైతుల కష్టాన్ని తెలుసుకోవడానికి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారన్నా రు. ఆయన పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నోటీసులను ఎ స్పీ తమకు ఇచ్చారన్నారు. రైతులతో భేటీకి 500 మంది, హెలిప్యాడ్ వద్ద 30 మంది మాత్రమే వెళ్లాలని చెప్పారన్నారు. అయితే జననేతను చూడడానికి వచ్చే జనాన్ని ఆపడం ఎవరితరం సాధ్యం కాదన్నారు. జనం జగన్‌ను చూడడానికి వస్తారని, వాళ్ల అభిమానాన్ని తాము అదుపు చేయలేమని స్పష్టం చేశారు.