
విద్యాభివృద్ధికి కృషి చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మెగా పీటీఎం 2.0 నిర్వహణపై ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా పీటీఎం 2.0 ను ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 178 ప్రైవేట్ పాఠశాలల్లో పీటీఎం కార్యక్రమం నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తదవతరులు పాల్గొన్నారు.