
డ్రైవర్ ఆత్మహత్య
బంగారుపాళెం: కుటుంబ కలహా ల కారణంగా డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం బంగారుపాళెం మండలంలో చోటుచేసుకుంది. సీఐ కథనం.. యాదమరి మండలం, సీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన చాకల మునిరత్నం కుమారుడు చాకల దామోదరం(49) కోళ్ల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నడు. మద్యానికి బానిస కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించా రు. మనస్తాపానికి గురైన దామోదరం బంగారుపాళెం సమీపంలోని కొత్తపల్లె రోడ్డు వద్ద కోళ్ల వాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మూడు నెలల్లో
రూ.38.15 కోట్ల ఆదాయం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ పరంగా ఆదాయం మూడు నెలల్లో రూ.38.15 కోట్లు వచ్చిందని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా ఆదాయ లక్ష్యం రూ.218 కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఇప్పటి వరకు రూ.38.15 కోట్లు వచ్చిందన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం రూ.50.17 కోట్లు లక్ష్యంగా కాగా అందులో రూ.38.15 కోట్లు ఆర్జించినట్టు వెల్లడించారు. ఇందులో బంగారుపాళ్యం రూ.2.05 కోట్లు, కుప్పం రూ.5.55 కోట్లు, పలమనేరు రూ.8.12 కోట్లు, పుంగనూరు రూ.4.40 కోట్లు, కార్వేటినగరం రూ.1.34 కోట్లు, నగరి రూ.3.24 కోట్లు, చిత్తూరు ఆర్వో రూ.9.67 కోట్లు, చిత్తూరు రూరల్ రూ.3.74 కోట్లు వచ్చిందన్నారు. గతంలో నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్స్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యేవి కావని, ప్రస్తుతం ఈ సమస్యను ఐజీ కార్యాలయం పరిష్కరించిందని చెప్పారు.

డ్రైవర్ ఆత్మహత్య