అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ
చిత్తూరు కలెక్టరేట్ : అగ్నిమాపక ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మాక్‌డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎండలు పెరిగాయని, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకర్, లీడింగ్ ఫైర్‌మెన్ ఏసుపాదం, సురేష్ పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ


