వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరారు.

వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యం

పెనుమూరు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రచారం చేపట్టారు.

మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉత్తమ ఫలితాలను అందించాయి.. విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశాయి.. సర్కారు బడుల్లో కల్పించిన సౌకర్యాలు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వెసులుబాటు కల్పించాయి.. ప్రభుత్వ చిత్తశుద్ధిని పదో తరగతి ఫలితాలు రుజువు చేశాయి. సరైన ప్రోత్సాహం అందిస్తే పేద బిడ్డలు సైతం కార్పొరేట్‌కు ధీటుగా మార్కులు సాధించగలరని చాటి చెప్పారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆరో స్థానంలో నిలబెట్టారు. ప్రైవేటు స్కూళ్ల కంటే అత్యుత్తమంగా రాణించి సత్తా చూపించారు.

జిల్లాలో పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్న డీఈఓ దేవరాజు

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించినవారు

● బైరెడ్డిపల్లె మండలంలోని ఏపీరెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థి సి.తన్మయి 592 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

● సదుం మండలంలోని బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలో చదివిన మణి, రామకుప్పం మండలం విజలాపురం జెడ్పీ హైస్కూల్‌లో చదివిన అఫ్‌షాన్‌ 589 మార్కులు సాధించి రెండో స్థానం దక్కించుకున్నారు.

● చిత్తూరులోని కణ్ణన్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సంతోషి, కార్వేటినగరంలోని ప్రభుత్వ పాఠశాలకు చెంది న యశ్వంత్‌, బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె మోడ ల్‌ స్కూల్‌ విద్యార్థిని మంజుల, గుడుపల్లె మండలం సోదిగానిపల్లె జెడ్పీ పాఠశాల విద్యార్థిని కావ్యశ్రీ, ఐరా ల మండలం ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్థిని బిందుసా యి, బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి కిరణ్‌కుమార్‌ 587 మార్కులు సాధించారు.

మెరుగైన ఫలితాలు

ప్రైవేట్‌, కార్పొరేట్‌ బడులకు ధీటుగా జిల్లాలో సర్కారు బడుల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఎవ్వరికీ తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, డీవైఈఓలు, ఎంఈఓల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది.

– దేవరాజు, డీఈఓ, చిత్తూరు

మెరుగైన విద్య

మాది నగరి మున్సి పాలిటీ సత్రవాడ, మా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగు పడింది. నేతపై ఆధారపడి జీవించే కుటుంబం మాది. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనే మా కుమార్తె కార్తీకను చదివించాం. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ఈ బడిలో వసతులను కల్పించారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగు, విద్యా సామగ్రి అంతా ప్రభుత్వమే ఇస్తోంది. పదోతరగతికి ప్రత్యేక తరగతులు తీసుకొని బోధించారు. దీంతో మా కుమార్తె అత్యుత్తమ ప్రతిభను కనబరచింది. 580 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. – జగన్నాథన్‌, సుమిత

సత్తా చాటిన కవలలు

మా నాన్న సుధాకర్‌ బంగారు షాపులో పని చేస్తూంటారు. అమ్మ స్వప్న గృహిణి. మాది మధ్య తరగతి కుటుంబం. మేము కవల పిల్లలం. ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాం. బీణసాయికి 565 మార్కులు వచ్చాయి. మా ఇద్దరి కల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలనుంది. 587 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మండల టాపర్‌గా నిలిచా. మా స్కూల్‌ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వం కల్పించిన వసతులను ఉపయోగించుకుని ఈ మార్కులు సాధించాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో బాగా చదువుకున్నాం. – బిందు సాయి, బీణ సాయి, ఐరాల

వందశాతం ఉత్తీర్ణత

పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందని స్థానిక ఏంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఎప్పటికప్పుడు వారి సామర్థ్యాలు మెరుగు పరి చేలా చర్యలు తీసుకోవడమే ఉత్తమ ఫలితాలకు కారణమైందని వివరించారు. – శ్రీనివాసులురెడ్డి

నిష్పక్షపాతంగా

ఎన్నికల నిర్వహణ

పుంగనూరు : జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం పట్టణంలో నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఆర్‌ఓ కేంద్రాన్ని తనిఖీ చేశారు. టీడీపీ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌ ఇక్కట్లను స్వయంగా తొలగించి, రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం విలేకర్లతో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరులో ప్రత్యేక దళాల బందోబస్తు నడుమ పోలింగ్‌ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనుమానితులు, రౌడీ షీటర్లు, తీవ్రమైన నేర చరిత్ర గలవారిని బైండోవర్‌ చేశామన్నారు. ఎన్నికలలో సామాన్యులు ధైర్యంగా ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఆర్‌ఓ నరసింహప్రసాద్‌ పాల్గొన్నారు.

ఎన్నికలకు వేతనంతో కూడిన సెలవు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో కార్మికులుగా పనిచేస్తున్న కర్ణాటక ఓటర్లకు ఈ నెల 26 , మే 7వ తేదీన సెలవు ఇవ్వాలని జిల్లా కార్మికశాఖాధికారి ఓంకార్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో రెండు దశలుగా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రోజుల్లో కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. ఈ మేరకు కార్మిక కమిషనర్‌ శేషగిరిబాబు, జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మే 13వ తేదీన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా దుకాణాలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించారు. సంబంధిత యజమానులు ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు.

ఏనుగుల దాడిలో

పంటల ధ్వంసం

రామకుప్పం: మండలంలోని ఎస్‌.గొల్లపల్లె సమీపంలో పంటపొలాలపై ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి దాడి చేసింది. పలువరు రైతులకు చెందిన వేరుశనగ, బీన్స్‌, రాగి, అరటి పంటలతోపాటు గంట్లప్ప అనే రైతుకు చెందిన డ్రిప్‌ పరికరాలను నాశనం చేసింది. ఇప్పటికై నా అటవీ అధికారులు స్పందించి ఏనుగులను కట్టడి చేయాలని బాధితులు కోరారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు బడులు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. ప్రైవేట్‌ యాజమాన్యాలను అధిగమించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉత్తమంగా రాణించారు. గత టీడీపీ పాలనలో కార్పొరేట్‌ వ్యవస్థకు రెడ్‌ కార్పెట్‌ వేయడంతో ప్రైవేట్‌ స్కూళ్లతే ఆధిపత్యం ఉండేది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మారులు తీసుకువచ్చింది. సర్కారు ప్రోత్సాహాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని అద్భుతంగా ఫలితాలు సాధించారు.

ప్రైవేట్‌ వెనుక ‘బడి’..!

జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో అన్ని యాజమాన్యాల నుంచి 20,399 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 19,113 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో ప్రైవేట్‌ బడులు వెనుకబడ్డాయి. జిల్లాలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ బడులలో 4,756 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నుంచి పది పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 14,357 మంది ఉత్తీర్ణత సాధించారు

17 నుంచి ఆరోస్థానంలోకి

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ పది ఫలితాలను విడుదల చేశారు. అనంతరం జిల్లా ఫలితాలను డీఈఓ కార్యాలయంలో డీఈఓ దేవరాజు విడుదల చేసి వివరాలు వెల్లడించారు. గత ఏడాది జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 6 స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 20.27 శాతం ఫలితాలు పెరగడం విశేషం.

బాలికలదే హవా

పది పరీక్షలకు 10,793 మంది బాలురు హాజరుకాగా 9596 మంది ఉత్తీర్ణత చెందారు. అలాగే 10,146 మంది బాలికలు పరీక్షలు రాయగా 9517 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 88.91 శాతం, బాలికలు 93.8 మొత్తం 91.28 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

మొదటి డివిజన్‌లో 15,463 మంది

జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 15,463 మంది మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు. రెండో డివిజన్‌లో 2593 మంది, మూడో డివిజన్‌లో 1057 మంది మొత్తం 19,113 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు.

కేజీబీవీ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు

జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికల చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాకుడదని సకల సౌకర్యాలనుకల్పించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న బాలికలు పది ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని 8 కేజీబీవీ పాఠశాలల్లో 5 బడులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రామకుప్పం కేజీబీవీలో చదివిన నేత్ర 600 మార్కులకు 569, గుడుపల్లె కేజీబీవీలో పుష్పలత 565, బైరెడ్డిపల్లి, శాంతిపురం కేజీబీవీల్లోని మాధవి, మహేశ్వరి 552 మార్కులను సాధించి శభాష్‌ అనిపించుకున్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

పదోతరగతి ఉత్తీర్ణతలో జిల్లాకు 6వ స్థానం

20,939 మందికి గాను

19,113 మంది పాస్‌

సత్తా చాటిన సర్కారు బడుల విద్యార్థులు

93.80శాతంతో పైచేయి సాధించిన బాలికలు

ప్రైవేట్‌ స్కూళ్లలో 4,756 మంది..

ప్రభుత్వ పాఠశాలల్లో 14,357 మంది ఉత్తీర్ణులు

కేటగిరీ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు పాస్‌ అయినవారు ఉత్తీర్ణత శాతం

ఎయిడెడ్‌ 139 194 95.57

బీసీ వెల్ఫేర్‌ 116 121 100.00

ప్రభుత్వ 708 1078 79.38

కేజీబీవీ 258 290 95.71

మున్సిపల్‌ 423 630 78.36

ఆదర్శ పాఠశాలలు 430 458 98.49

ప్రైవేట్‌ స్కూళ్లు 4,439 4,756 97.40

ఏపీ రెసిడెన్షియల్‌ 111 112 100.00

ఏపీ సోషల్‌వెల్ఫేర్‌ 442 472 98.74

ఏపీ ట్రైబల్‌వెల్ఫేర్‌ 61 82 91.11

జిల్లా పరిషత్‌ 8,336 10,920 88.39

మొత్తం 15,463 19,113 90.28

మే 24 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ

పదోవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్‌ 3 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ లోగా అపరాధ రుసుం లేకుండా సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ అప్లికేషన్లను www.bse. ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్‌ కు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వారు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున సీఎఫ్‌ఎంఎస్‌ చలానా ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు

నేతపై ఆధారపడి జీవించే కుటుంబం కావడంతో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనే మా కుమారుడు సంతోష్‌ను చదివించాం. అయితే విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాఠశాల మెరుగుపడింది. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, ప్రతి గదికి వెలుతురు, గాలి బాగా ఉందేలా లైట్లు, ఫ్యాన్లు అమర్చారు. గ్రీన్‌ బోర్డు పెట్టారు. ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ బడి మెరుగుపడింది. మా కుమారుడు మంచి పాఠశాలలో చదువుతున్నాడన్న ఆనందం మాకూ కలిగింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 577 మార్కులు సాధించి మండలంలో రెండవ స్థానంలో నిలిచాడు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. – బాలాజీ, హేమావతి

అందరూ శభాష్‌ అంటున్నారు

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చులకనగా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడంతో అవి కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మారిపోయాయి. ఇక్కడే మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారు. ఇంగ్లిషు మీడియం అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‌ ల్యాబ్‌ ఉంది. చదువుతో పాటు ఆడుకునేందుకు కూడా పరికరాలు అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆరోగ్యంగా చదువుకుంటున్నారు. ఇలాగే మా కుమారుడు తమిళ్‌సెల్వన్‌ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే బాగా చదువుకుని 577 మార్కులు సాధించి మండలంలో రెండో స్థానంలో నిలిచాడు. అందరూ శబాష్‌ అంటున్నారు. మాకు గర్వంగా ఉంది. – విశ్వనాథన్‌, తేన్‌మొళి

వసతి గృహాల్లో 88.41 శాతం

జిల్లా వ్యాప్తంగా 37 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇక్కడి విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ వసతి గృహాల నుంచి 302 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. ఇందులో 267 మంది పరీక్షలు ఉత్తీర్ణత పొందారు. 88.41 శాతం ఉత్తీర్ణతతో సత్తీ చాటారు.

1/8

2/8

రాకపోకలను పునరుద్ధరిస్తున్న ఎస్పీ మణికంఠ
3/8

రాకపోకలను పునరుద్ధరిస్తున్న ఎస్పీ మణికంఠ

4/8

5/8

6/8

7/8

8/8

Advertisement
 
Advertisement
 
Advertisement