
రథంలో కొలువుదీరిన స్వామివారు
తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. సర్వాలంకారభూషితుడైన అనంత తేజోమూర్తి రథాన్ని అధిరోహించగా, అశేష భక్తుల గోవింద నామస్మరణలు, చెక్కభజనలు, కోలాట ప్రదర్శనలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి రథోత్సవం సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. పానీయాలతో పాటు విసన కర్రలు వితరణ చేశారు. దారి పొడవునా భక్తులు మిరియాలు, కలకండను స్వామి వారి రథంపై చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల కు స్వామివారు అశ్వవాహనం అధిరోహించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

రథోత్సవంలో పాల్గొన్న అశేష భక్తులు