
రుణాలకు ‘చంద్ర’గ్రహణం
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమలలో దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో శ్రీవారి దర్శనభాగ్యం లభిస్తోంది.
వ్యాపారులు ముందుకు రాకపోవడం
సీఎం భద్రతలో అలసత్వం వద్దు
ఇసుక ధరలకు రెక్కలు
ఇటీవల కురిసిన వర్షాలకు కౌండిన్య నదిలో నీరు చేరడంతో మార్కెట్‌లో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది.
ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2025
మామిడి ధరలు ఆరంభంలోనే అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చెంతనే పండ్ల గుజ్జు పరిశ్రమలు ఉన్నా ఆదుకోలేకపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన మామిడి పండ్లకు ధరలు రోజురోజుకు పతనమవుతుండడం ఆవేదనకు గురిచేస్తోంది. పరిశ్రమలు పక్క రాష్ట్రాల నుంచి మామిడి పండ్లను దిగుమతి చేస్తుండడంతో జిల్లాలో పండించే మామిడికి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. కాపుదశ ఆలస్యంగా జిల్లాలో ప్రారంభం కావడంతో పక్క జిల్లాల నుంచి మార్కెట్‌కు పండ్లు పోటెత్తుతున్నాయి. ధరలు లేకపోవడంతో ప్రస్తుతం తోటల్లోనే కాయలను వదిలేసే పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
కాణిపాకం : మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఫలరాజును ఏటా ధరలు కుంగదీస్తున్నాయి. ఆరంభంలోనే ఈసారి మామిడి ధరలు రైతులను ఢీలాకు గురిచేస్తున్నాయి. గిట్టుబాటు కానీ ధరతో రైతుల చేతికి నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రెండు రోజుల్లో టేబుల్ రకానికి డిమాండ్ పూర్తిగా పడిపోయింది. అడిగేవారు లేకపోవడంతో ధరలు పతానికి చేరుకున్నాయి. కోత కోసి మార్కెట్‌కు కాయలను తెస్తే... ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో మామిడి రైతుల్లో గుబులు పుట్టుకుంది.
ధరల పతనానికి కారణాలు
జిల్లాలో 47 పండ్ల గుజ్జు పరిశ్రమలున్నాయి. మే నెల ఆరంభం నుంచే కొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. కేరళ నుంచి అల్పోన్సో కాయలను దిగుమతి చేసుకుని గుజ్జు చేయడం ప్రారంభించాయి. ఇదే మాదిరిగానే మరికొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకుని విజయవాడ నుంచి కాయలను దిగుమతి చేసుకుని గుజ్జు తయారీని వేగవంతం చేశాయి. దీని కారణంగా జిల్లా కాయలపై దెబ్బపడుతోంది. అక్కడి ధరలను తక్కువ చూపించి...ఇక్కడ కాయల ధరలను తగ్గించేస్తున్నారు. ఇక జిల్లాలో పండే టేబుల్ రకాలను చిత్తూరు మార్కెట్ నుంచి అధికంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వ్యాపారులు కొనుగోలు చేసి వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్నారు. అయితే విజయవాడ ప్రాంతంలో సీజన్ ముగింపు దశలో ఉందని...దీంతో అక్కడి నుంచి ఈ రెండు రాష్ట్రాల వ్యాపారుల వ్యాపారం పుంజుకోవడంతో ..ఇక్కడి వ్యాపారం పడిపోయినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. దీంతో పాటు అక్కడి మామిడి ధరలు తక్కువ పలకడం...ఇక్కడ వ్యాపారం మందగించిందని అంటున్నారు.
చేతులెత్తేస్తున్న ట్రేడర్లు
టేబుల్ రకం కాయల ధరలు పడిపోతున్నాయని భావించి చాలా మంది రైతులు కాయలు పక్వానికి రాకముందే జోరుగా కోతలు కోస్తున్నారు. పక్వానికి రాకపోయినా కోత కోసి మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇక ఇప్పుడు రైతులు తోతాపురి కోత కోస్తామంటే అసలే వద్దంటున్నారు. మేం కొనలేమని మందే ట్రేడర్లు చేతులెత్తేస్తున్నారు. ధరలు లేకపోవడంతో కొంత మంది రైతులు కాయలను అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. లేకుంటే ఆవులకు మేత పెడుతున్నారు.
చిత్తూరులో మార్కెట్‌లో ఎగుమతికి సిద్ధమవుతున్న కాయలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్మన్
వి.కోట : వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లాల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు శనివారం కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛమిచ్చారు. అనంతరం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మా ట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమా లు, అన్యాయాలు, దౌర్జన్యాలు తమ అధినేతకు వివరించారు. అలాగే తమ ప్రభు త్వ ఆధ్వర్యంలో కొనసాగించిన అభివృద్ధి పను లను వివరించారు. ఆయనతో పాటు శాంతీపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు, మండల నాయకులు కృష్ణమూర్తి, సురేష్ పాల్గొన్నారు.
అటవీ సిబ్బందికి మావటీల శిక్షణ
చిత్తూరు కార్పొరేషన్ : కుప్పం, పుంగనూరు, పలమనేరు రేంజ్ పరిధిలోని 30 మంది అటవీ సిబ్బందికి మావటీలుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల జిల్లాకు కుంకీ ఏనుగులు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 5 ఏనుగులు రాగా, ఇందులో ఒకటి తిరుపతి జిల్లాకు, నాలుగు చిత్తూరు జిల్లాకు కేటాయించారు. వీటితోపాటు గతంలో ఉన్న రెండు ఏనుగులు కలిపి మొత్తం 7 ఏనుగులు పలమనేరులోని ననియాలలో ఉన్నాయి. బెంగళూరు నుంచి కుంకీలతో పాటు జిల్లాకు వచ్చిన మావటీలు ఇక్కడ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇదివరకే జిల్లా నుంచి సిబ్బంది బెంగళూరుకు వెళ్లి శిక్షణ తీసుకున్నారు. కాగా ఇక్కడ సిబ్బందికి బెంగళూరుకు చెందిన మావటీల సమక్షంలో పలు మెలకువలు వారికి నేర్పనున్నారు. ఏదైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెలరోజుల పాటు వారికి మెలకువలు నేర్పించిన తరువాత కుంకీలను గజ దాడుల నివారణకు పంపనున్నట్లు తెలుస్తోంది.
ఎస్‌ఆర్పీలకు శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సమగ్రశిక్ష శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌పీ (సీనియర్ రీసోర్స్ పర్సన్)కు మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఎస్‌ఆర్‌పీలను శిక్షణకు ఎంపిక చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించే రెసిడెన్షియల్ శిక్షణకు హాజరు కావాలని ఆదేశించారు. అదే విధంగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణిత, సైన్స్ టీచర్లకు ఎక్స్‌పోజర్ విజిట్‌ను నిర్వహించనున్నారు. ఈ విజిట్ ఈనెల 26వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వరకు అయిదు విడతల్లో చేపట్టనున్నారు. ఇందుకు జిల్లాలో ఎంపిక చేసిన టీచర్ల జాబితాను జిల్లా సమగ్రశిక్ష కార్యాలయానికి పంపారు. ఆ జాబితాలో ఎంపిక చేసిన టీచర్లు తప్పనిసరిగా పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆక్రమణ దుష్ప్రచారం కాదు.. నిజమే
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఆక్రమణ దుష్ప్రచారం కాదని.. నిజమేనని అటవీశాఖ అధికారులు తేల్చారు. పది రోజుల కిందట చిత్తూరు మండలం ఎగుమాసాపల్లి ప్రాంతంలో అటవీశాఖ భూమి ఆక్రమణకు గురైంది. ఈ విషయంపై టీడీపీ నేతలు, గ్రామస్తులు అటవీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఆక్రమణలో భాగంగా చదును చేస్తున్న రెండు జేసీబీలను పట్టుకున్నారు. ఆ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిని విచారించగా ఈ భూ ఆక్రమణలో...ఓ కూటమినేతే కీలకమని తేలింది. ఆక్రమిత భూమి అటవీశాఖదా...కాదా అనే తేల్చడానికి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు. ఆ సర్వేలో ఆక్రమణ భూమి అటవీశాఖ భూమిగా నిరూపితమైంది. అయితే ఈ విచారణకు బ్రేకులు వేసి జేసీబీలను అటవీశాఖ అధికారుల నుంచి విడిపించేందుకు భారీ స్థాయిలో రాజకీయం నడిచింది. ఈ ఆక్రమణ వ్యవహరంపై ఇటీవల సాక్షి దినపత్రికలో భూమేత పేరిట కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఆక్రమణదారులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. కేసును తప్పుదారి పట్టించేందుకు కుట్రలు చేశారు. అయితే ఆ దుష్ప్రచారం అవాస్తమని..ఆక్రమణ నిజమని అటవీశాఖ అధికారులు నిరూపించారు. నలుగురు వ్యక్తులపై కేసులు పెట్టి జేసీబీలను సీజ్ చేశారు.
అటవీభూమి ఆక్రమణలో నలుగురిపై కేసు
చిత్తూరు కార్పొరేషన్ : అటవీ భూమి ఆక్రమణకు యత్నించిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్వో థామస్ తెలిపారు. శనివారం ఎఫ్‌ఆర్వో కార్యాలయంలో వివరాలను తెలియజేశారు. ఎగువమాసపల్లెకు చెందిన కుమార్‌నాయుడు, గువ్వకల్లుకు చెందిన లీలాకర్‌రెడ్డి, జంగాపల్లెకు చెందిన జేసీబీ డ్రైవర్లు మధుబాబు, గోపిపై కేసు నమోదు చేశామన్నారు. ఇటీవల చిత్తూరు రూరల్ మండలం ఎగువమాసపల్లెలో రెండు జేసీబీల ద్వారా భూమిని చదును చేస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. వీటిపై సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి జేసీబీలను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులో తీసుకున్నామన్నారు. వారిని విచారించగా ఎగువమాసపల్లెకు కుమార్‌నాయుడు, లీలాకర్‌రెడ్డి చెప్పడంతో పనులు చేశామన్నారు. ఆ భూమి వారిదని చెప్పడంతో చదును చేయడానికి వెళ్లనట్లు చెప్పారన్నారు. తదుపరి రెవెన్యూ, అటవీ సిబ్బంది కలిసి సంయుక్తంగా సర్వే చేయగా అటవీ భూమిని తేలిందన్నారు. దాదాపు అర ఎకరంలో కలుపు మొక్కలను తొలగించినట్లు గుర్తించామన్నారు. డీఎఫ్‌ఓ ఆదేశాల మేరకు అటవీభూమి అన్యాక్రాంతం కింద కేసు నమోదు చేశామన్నారు. సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు వివరించారు.
యోగాతో మానసిక ప్రశాంతత
చిత్తూరు కలెక్టరేట్ : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చిత్తూరు ఆర్‌డీవో శ్రీనివాసులు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో మాట్లాడుతూ నేటి యాంత్రిక యుగంలో యోగాతో మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. డీఎస్పీ సాయినాథ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో యోగా చాలా ముఖ్యమన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారిణి గౌరి, డీఎస్‌డీవో బాలాజీ, ఎంహెచ్‌వో లోకేష్, యోగా గురువులు నరేంద్ర, బాబు, రాజేంద్ర పాల్గొన్నారు.
శాంతిపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సొంతింటి గృహప్రవేశం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం చూపరాదని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ నాచ్కేత్ విశ్వనాథ్ పోలీసులను ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక కల్యాణ మండపంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సీఎం, ఇతర వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుప్పం–పలమనేరు జాతీయ రహదారి పక్కన కడపల్లి పంచాయతీలోని శివపురం వద్ద నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలపై ప్రత్యేక సూచనలు చేశారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. వి.కోట వైపు నుంచి వచ్చే వాహనాలను బడుగుమాకులపల్లి నుంచి విజలాపురం మీదుగా కుప్పానికి, కుప్పం వైపు నుంచి వచ్చే వాహనాలను తంజంకొట్టాలు నుంచి రాళ్లబూదుగూరు మీదుగా తుమ్మిశికి మళ్లించాలని చెప్పారు. ద్రవిడ యూనివర్శిటీ నుంచి పీఈఎస్ మీదుగా సీఎం రాకపోకలు సాగించే రూట్ మ్యాప్‌ను వివరించారు. కాగా ఎస్‌ఎస్‌జీ డైరెక్టర్ నాచ్కేత్ విశ్వనాథ్, జిల్లా ఎస్పీ మణింకంఠ చందోలు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, కుప్పం డీఎస్పీ పార్థసారథి సీఎం పర్యటన మార్గాన్ని, గృహ ప్రవేశం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ రూట్ మ్యాప్‌లోని ప్రాంతంలో ఉన్న కల్వర్టులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలో కార్పొరేషన్‌ల వారీగా దరఖాస్తుల వివరాలు
కార్పొరేషన్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా
పేరు దరఖాస్తులు దరఖాస్తులు
బీసీ 18175 14293
బ్రాహ్మణ 44 40
ఈబీసీ 384 281
కమ్మ 440 326
క్షత్రియ 46 78
రెడ్డి 363 351
వైశ్య 120 133
కాపు 1781 1872
ఎంఎస్‌ఎంఈ 24 70
బీసీ జెనరిక్ 42 46
కుమ్మర, మేదర 85 53
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నాం దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రభుత్వం రెండు నెలల కిందట ఆర్భాటం చేసింది. ఉపాధి రుణాలిస్తుందనే ఆశతో జిల్లాలోని నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. చివరికి ఆ రుణాలను మంజూరు చేయకుండా అభ్యర్థులకు మొండిచేయి చూపింది. ఆశావహులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రస్తుతం రుణాలు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం బోర్డు తిప్పేసింది. దీంతో దరఖాస్తుదారులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
బీసీ కార్పొరేషన్ కార్యాలయం
● స్వయం ఉపాధి రుణాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు
● మొదట్లో గొప్పగా ప్రచారం చేసిన కూటమి
● అణగారిన వర్గాలకు కుచ్చుటోిపీ
● మంజూరు చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
పడిపోయిన ధరలు
ధరలు పోతాయని జోరుగా మామిడి కోతలు
బేనీషా, చందూర రకం పండ్ల ధరలు పతనం
టేబుల్ రకాలను అడిగేవారు కరవు
తోతాపురి కొనుగోళ్లు నిల్
రైతుల్లో గుబులు
పట్టించుకోని ప్రభుత్వం
కూటమినేతల ఆటకట్టించిన అటవీశాఖ అధికారులు
ఆక్రమణదారులపై కేసు నమోదు
ప్రజాప్రతినిధులకు తలొగ్గని అటవీశాఖ అధికారులు
గంగ జాతర తర్వాత చిత్తూరు మ్యాంగో మార్కెట్‌లో 15 ట్రేడర్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే మామిడి వ్యాపారం జోరందుకుంది. వారి వద్దకు టేబుల్ రకాలు వెతుక్కుని వస్తున్నాయి. ఆ కాయలను వారి నుంచి కొనుగోలు చేసే వ్యాపారులు తగ్గుముఖం పట్టడంతో మామిడి ధరలు పడిపోయాయి. వారానికి ముందు బేనీషా కిలో రూ.30 పలికింది, తర్వాత రూ. 27కు తగ్గింది. ఇప్పుడు కిలో ధర రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. వారానికి ముందు చందూర కిలో రూ. 11 నుంచి రూ.20 వరకు అమ్ముడుబోయింది. ఇప్పుడు కిలో రూ. 8కు కొనుగోలు జరుగుతోంది. అల్పోన్సో మాత్రం కిలో ధర రూ.25తో నిలకడగానే ఉంది. తోతాపురిలో టేబుల్ రకాన్ని మాత్రమే కొంటున్నామని.ఈ కాయ కిలో ధర రూ. 12 రేటు ఫిక్స్ చేశారు. సాధారణ తోతాపురి కాయలను కొనేవారు లేరంటూ రూ.4కు ఇస్తే తీసుకుంటామని వ్యాపారులు చెబుతున్నారు.
అడిగేవారే లేరు..
బేనీషాను అడిగేవారు లేరు. చందూరు కూ డా అంతే పరిస్థితి. ఎ వరైనా కొనుగోలు చే సేందుకు వస్తే కిలో రూ.15కే ఇచ్చేస్తాం. ఆరంభంలో బేనీషా రూ. 30 పలికింది. మొన్న రూ.27 ఉండేది. ఈ రోజు అడిగే వారు లేక కుప్పలు పోసి పెట్టాం. ఈ దెబ్బకు బెంగుళూరా (తోతాపురి) కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీ వాళ్లు కూ డా కొనే పరిస్థితుల్లో లేరు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు జరిగే వ్యాపారం డల్‌గా ఉంది.
– రత్నంరెడ్డి, వ్యాపారి–రైతు, చిత్తూరు
కలెక్టర్ చొరవ చూపాలి
మామిడి సాగుకు పెట్టే ఖర్చులు సగం కూడా రావడం లేదు. పూత నుంచి కాయ పక్వానికి వచ్చే వరకు పంటను భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ పంట వస్తే రాత్రింభవళ్లు నిద్ర ఉండదు. అక్కడే కాపాలా కాస్తున్నాం. వర్షాలు, ఎండను లెక్కచేయకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నాం. ఆ కష్టం మాకు దక్కడం లేదు. మార్కె ట్లో ధరలు నిలకడగా ఉండేలా చూడాలి. కలెక్టర్ చొరవ చూపాలి.
– కుప్పయ్యనాయుడు, రైతు, సిద్దంపల్లి గ్రామం, చిత్తూరు మండలం
టేబుల్ రకాలు.. ధరలు నేలచూపు
జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818 హెక్టార్లు, అల్పోన్సో 3,127 హెక్టార్లు, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లల్లో సాగువుతున్నాయి. ప్రస్తుతం వీటిలో టేబుల్ రకాలను మాత్రమే రైతులు కోతకు పెట్టారు. ఈసారి గంగజాతర తర్వాత నుంచి టేబుల్ రకాలను జోరుగా కోతకోస్తున్నారు. రైతులకు అందుబాటులో ఉండే చిత్తూరు, పలమనేరు, దామలచెరువు ఇతర మార్కెట్‌కు కాయలను తరలిస్తున్నారు. ఽఅయితే ఈ కాయలకు మార్కెట్లో ధరలు పలకడం లేదు. చందూర, బేనీషాను కొనేవారు లేరని చిత్తూరు మార్కెట్లోని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీని దెబ్బకు వారు నాటుకాయలు, తోతాపురిపై పూర్తిగా ముఖం చాటేశారు.

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం

రుణాలకు ‘చంద్ర’గ్రహణం