
పొట్టకొట్టారు.. వీధిలోకి నెట్టారు!
కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎండీయూ వాహనాలు నిలిపేస్తోందని ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుబాటులో రూ.100 స్టాంప్ పేపర్లు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నాన్ జ్యుడీషియల్ రూ.100 స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉంచామని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. ఇన్ని రోజులు ఈ పేపర్లు స్థానికంగా నిల్వలేవని, ప్రస్తుతం వాటిని అందజేశామన్నారు. చిత్తూరు అర్బన్‌లో 7,000, చిత్తూరు రూరల్‌లో 4,000, బంగారుపాళ్యంలో 3,000, పలమనేరులో 6,000, పుంగనూరులో 5,000, కుప్పంలో 6,000, కార్వేటినగరంలో 3,000 కలిపి మొత్తం 40,000 స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా స్పెషల్ ఎడిషన్ స్టాంప్స్ కూడా అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కొనుగోలుకు చం‘దూరం’
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మామిడి కాయల మార్కెట్‌లో చందూర రకం మామిడిని అడిగేవారు లేరు. మ్యాంగో గుజ్జు ఫ్యాక్టరీలు కూడా చందూరను కొనుగోలు చేయడం లేదు. కేవలం అల్పోన్సోను మాత్రమే కొంటున్నాయి. దీంతో చందూర కొనుగోలుకు ట్రేడర్లు మొగ్గుచూపడం లేదు. ప్రస్తుతం చిత్తూరు నగరంలోని మామిడి కాయల మార్కెట్‌కు ప్రస్తుతం టేబుల్ రకాలైన బేనీషా, చందూర, అల్పోన్సో వంటివి మాత్రమే జోరుగా వస్తున్నాయి. ఇందులో అల్పోన్సోకు మాత్రమే డిమాండ్ ఉంది. మిగిలిన రకాల ధరలు క్షీణిస్తున్నాయి. బేనీషా రెండు రోజులకు కిత్రం కేజీ రూ.20 ఉంటే ..సోమవారం రూ.15లకు పడిపోయింది. తోతాపురిలో టేబుల్ రకం రూ.12 నుంచి రూ. 10లకు చేరింది. అల్పోన్సో మాత్రం తొలి నుంచి కూడా రూ.25 పలుకుతోంది. ఇక చందూర కేజీ రూ.8లకు పడిపోయింది. ఫ్యాక్టరీ వాళ్లు చందూరను వద్దంటున్నారని ట్రేడర్లు సైతం ముఖం చాటేస్తున్నారు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
– 8లో