
ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన
కుప్పం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన ముగించుకుని సోమవారం విజయవాడకు తిరుగు ప్రయాణ మయ్యారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన నూతన గృహప్రవేశం తర్వాత ఉదయం 11 గంటలకు ద్రవిడ వర్సిటీ ప్రాంగణంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద ఏర్పా టు చేసిన హెలీప్యాడ్‌కు రోడ్డు మార్గాన చేరుకున్నారు. అనంతరం హెలిక్యాప్టర్‌లో బెంగళూరు చేరుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్ కంచెర్ల శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డిఐజి షిమోషి, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్ పాల్గొన్నారు.