
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల
● ఏడాది క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన రైతు భరోసా కేంద్రాలలను కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు మార్చేసింది. వాటి పనితీరును అస్తవ్యస్తం చేసేసింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం 30 సొన్నేగానిపల్లె ఆర్‌బీకే పరిధిలో సొన్నేగానిపల్లె, నాయనపల్లె, కూతేగౌనిపల్లె, బాబూనగర్, కేపీ మిట్ట, సంతూరు, గొల్లపల్లె, వెంకటేష్‌పురం గ్రామాల రైతులు ఉన్నారు. గత ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకూ ఈ ఆర్‌బీకేలో వేరుశనగ విత్తనాల పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది ఇప్పటికీ ఆ ఊసే లేదు. కనీసం ఒక్క ఎరువుల బస్తా కూడా రాలేదు. సిబ్బందిని కూడా రైతులకు అందుబాటులో లేకుండా కూటమి ప్రభుత్వం చేసేసింది. మంగళవారం ఉదయం ఆర్‌ఎస్‌కేకు వచ్చిన ఇన్‌చార్జి సైతం కార్యాలయంలో మీటింగ్ ఉందని వెళ్లిపోయాడు. దీంతో రోజంతా కేంద్రం మూతపడి ఉంది. ఇదే తంతు ఏడాదిగా జరుగుతుండడంతో ఇక్కడి వచ్చే రైతుల సంఖ్య కూడా తగ్గిపోయింది.

● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల