మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆవిష్కరించింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసింది. గ్రామ సచివాలయాలు రావడంతో సామాన్య గ్రామీణుడికి సైతం ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 700లకు పైగా సేవలను గ్రామీణుల గడప వద్దకే చేర్చారు.
వలంటీర్లు ద్వారా పల్లెవాసుల కష్టనష్టాలకు ఆసరాగా నిలిచారు. శిథిలావస్థలోని సర్కారు బడులకు ప్రాణం పోశారు. కార్పొరేట్ హంగులతో నిరుపేద పిల్లలకు ఉత్తమ విద్యను అందించారు. రోగం వస్తే దూరాభారం వెళ్లాల్సిన పనిలేకుండా సొంత ఊరిలోనే వైద్యం చేయించుకునేందుకు విలేజ్ క్లిన్‌క్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ఇంటింటికీ వైద్యసేవలు తీసుకువచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతలకు అండగా నిలిచారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటికే చేర్చారు.
అగ్రికల్చర్ అసిస్టెంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సాగును సంబరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించారు. గ్రామాల్లో పాలశీతలీకరణ కేంద్రాలే ఏర్పాటు చేశారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించారు. పశువులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దాదాపు ప్రతి పల్లెలో మూడు నుంచి నాలుగు ప్రభుత్వ భవనాలు నిర్మించారు. సీసీ రోడ్లు వేయించారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనించాయి. పల్లెసీమలు కళకళలాడాయి.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్వర్ణయుగం