
చెక్‌డ్యామ్‌కు గండి కొట్టిన ఘనుడు
పలమనేరు మండలం మొరం పంచాయతీలో కౌండిన్యనదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌కు ఓ రైతు గండి కొట్టాడు.
● ఇతడి పేరు భాస్కర్ రెడ్డి, విజయపురం మండలం, కళియంబాకం గ్రామం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈయనకు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే ఎరువులు, క్రిమిసంహారక మందులు, యూరియా అన్నీ అందేవి. ప్రస్తుతం ఎరువుల కోసం నానా యాతన పడుతున్నాడు. గతంలో రూ.270 తెచ్చుకునే ఎరువులను నేడు 15 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్‌ఎన్ కండ్రిగకు వెళ్లి రూ.300లకు కొంటున్నాడు. ట్రాన్స్‌పోర్టుకు రూ.30 అదనంగా ఖర్చవడంతోపాటు ఎరువుల కొనుగోలు కంటూ సగం రోజు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరు నెలలుగా ఎరువులకోసం రైతు సేవా కేంద్రంలో అడుగుతున్నా ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తున్నాడు. తూతూ మంత్రంగా జనుము మాత్రం పంపిణీ చేశారని వాపోయాడు. తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియని దుస్థితి కూటమి ప్రభుత్వంలో దాపురించిందని వాపోతున్నాడు.
● ఇతడి పేరు మనోహర్‌రెడ్డి, గుడిపాల మండలం మరకాలకుప్పం గ్రామం. ఏటా రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తాడు. అదే విధంగా ఈ పర్యా యం కూడా సాగుకు సన్నద్ధమయ్యాడు. అయితే ఇ ప్పటి వరకు రైతు సేవాకేంద్రాల్లో వేరుశనగ విత్త నాలు పంపిణీ చేయలేదు. అడిగితే సిబ్బంది తమకు తెలియదంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నా రని ఆవేదన చెందుతున్నాడు. దుక్కులతో పొలం సిద్ధం చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నాడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మే 15వ తేదీకే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసేవారని గుర్తుచేసుకుంటున్నాడు. కూట మి పాలనలో విత్తనాల ఊసేలేదని ఆరోపిస్తున్నాడు. వ్యవసాయశాఖ అధికారులకే వేరుశనగ విత్తనాల పంపిణీపై ఓ క్లారిటీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. సీజన్ పూర్తయి, అదును తప్పిన తర్వాత వి త్తనాలు ఇస్తారేమో అని ఆందోళన చెందుతున్నాడు.
జిల్లా సమాచారం
మొత్తం పంచాయతీలు : 697
రెవెన్యూ గ్రామాలు : 822
గ్రామీణ జనాభా : 15.04 లక్షలు
కుటుంబాలు : 4,65,970
గ్రామ సచివాలయాలు : 504
ఉద్యోగులు : 5,040
గతంలో పనిచేసిన
వలంటీర్లు : 7,728
రూరల్ లోని
కుటుంబాలు : 4,65,970
– 8లో

చెక్‌డ్యామ్‌కు గండి కొట్టిన ఘనుడు