కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణులను గాలికి వదిలేసింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత వైఎస్సార్‌సీసీ ప్రశేశపెట్టిన చక్కటి కార్యక్రమాలకు సైతం తిలోదకాలిచ్చింది. ప్రజలకు ఉపయోగపడే వాటిని నిర్వీర్యం చేసింది. అందులో భాగంగానే సచివాలయ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించింది. విలేజీ్ క్లినిక్‌ల లక్ష్యాలను నీరుగార్చింది. కనీస మాత్రం మందులు కూడా లేకుండా చేసి పల్లెవాసుల ఆరోగ్యంతో ఆటలాడుకుంది. ఇంటింటికీ వైద్యసేవలను తూతూమంత్రంగా మార్చేసింది.
ఆర్‌బీకేలకు రైతు సేవా కేంద్రాలుగా మార్చి.. అన్నదాతలకు అసలు సేవలే అందకుండా దుర్బుద్ధిని చాటుకుంది. పంటల సాగులో కనీసం సలహాలు అందించేందుకు కూడా వ్యవసాయాశాఖ అధికారులు అందుబాటులో లేకుండా చేసింది. నాడు–నేడు కింద అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న బడులను నిర్దయగా వదిలేసింది. పేద బిడ్డల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేందుకు తెగబడింది.

కూటమి పాలనలో సర్వం.. నిర్వీర్యం

కూటమి పాలనలో సర్వం.. నిర్వీర్యం