నెటిజన్‌ పోస్ట్‌కు కామెంట్ల వరద, స్పందించిన జొమాటో!

Zomato Replies Food Prices Controversy - Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ బిల్లుల వివాదంపై జొమాటో స్పందించింది. రాహుల్‌ కాబ్రా ఆఫ్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ ధరను జొమాటో డెలివరీ చేసే ఫుడ్‌ ఆర్డర్‌ ధరను పోల్చుతూ పోస్ట్‌ చేశాడు. ఆఫ్‌లైన్‌లో ఉన్న ధర కంటే జొమాటో పెద్ద మొత్తంలో కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తుందని ఆరోపించాడు.ఆ ఆరోపణలపై జొమాటో రిప్లయి ఇచ్చింది. 

కస్టమర్లకు,రెస్టారెంట్ల మధ్య జొమాటో అనుసంధానంగా పనిచేస్తుంది.ఆఫ్‌లైన్‌లో అందించే ధరలకు జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే కాబ్రా పోస్ట్‌పై స్పందిస్తూ.. కస్టమర్‌ ఫిర్యాదుల్ని రెస్టారెంట్ల దృష్టికి తీసుకొని వెళ్తామని వెల్లడించింది.

కామెంట్ల వరద
రాహుల్‌ కాబ్రా ఓ సంస్థలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా వర్క్‌ చేస్తున్నాడు. అయితే రెండు మూడు రోజుల క్రితం రాహుల్‌కు బాగా ఆకలి వేయడంతో ఆఫ్‌లైన్‌లో చెక్‌ చేసి వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలను ఆర్డర్‌ పెట్టాడు. ఫుడ్‌తో పాటు,ఇతర అదనపు ట్యాక్స్‌లు అన్నీ కలుపుకొని బిల్లు రూ.512 అయ్యింది. జొమాటోలో చెక్‌ చేస్తే ఆ ధర కాస్త రూ.75 డిస్కౌంట్‌ తీసేస్తే రూ.689.90గా ఉండడంతో కంగుతిన్నాడు. అంతా మోసం, దగా జొమాటో కస్టమర్ల దగ్గరనుంచి ఎంత మొత్తం వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ తాను ఆర్డర్‌ పెట్టిన ఫుడ్‌ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ బిల్స్‌ను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాదు ఆఫ్‌లైన్‌లో ఫుడ్‌ ఆర‍్డర్‌పై ఉన్న ధర కంటే జోమాటో ఎక్కువగానే 34.76% శాతంతో  690-512 =రూ.178 వసూలు చేసినట్లు రాహుల్‌ మండిపడ్డాడు. 

ఫుడ్‌ ఆర్డర్‌పై
ఇక రాహుల్‌ పెట్టిన లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌ తెగ వైరల్‌ అయ్యింది.ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టిన కస్టమర్ల నుంచి జొమాటో ఎంత వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ బిల్స్‌కు సంబంధించిన బిల్స్‌ను సైతం షేర్‌ చేశాడు. వీటిపై స్పందించిన నెటిజన్లు ఈ దిగ్గజ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలా ఇప్పటి వరకు కాబ్రా పెట్టిన పోస్ట్‌కు 2వేల కామెంట్లు, 12వేలకు మందికి పైగా నెటిజన్లు అతనికి సపోర్ట్‌ చేస్తూ లైక్‌ కొట్టారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top