వరల్డ్‌ టాప్‌ 100 ఎయిర్‌లైన్స్‌: మళ్లీ అదరగొట్టిన సంస్థ ఇదే!

Vistara only Indian airline among the top 20 globally check the list - Sakshi

ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు భారతీయ విమానయాన సంస్థలు చోటు సంపాదించు కున్నాయి. విమానయాన సంస్థలు విస్తారా, ఇండిగో మాత్రమే ఈ లిస్ట్‌లో  ఉండటం విశేషం.  టాప్‌ 100లో 49వ ‍ ర్యాంకు సాధించిన ఇండిగో మూడవ ఉత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా ఎంపికైంది. టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా 10 అత్యంత మెరుగైన విమానయాన సంస్థల జాబితాలో 9వ స్థానంలో ఉంది. 

స్కైట్రాక్స్  వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డుల ప్రకారం 2022లోని 20వ ప్లేస్‌నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి మరీ విస్తారా 16వ స్థానానికి చేరింది.అటు  ఇండిగో గత సంవత్సరం 45వ స్థానం నుండి రెండు స్థానాలు పెరిగి 43వ ర్యాంక్‌కు చేరుకుంది. టాప్ 100 ఎయిర్‌లైన్స్‌కు స్కైట్రాక్స్   ఈ అవార్డులను ఇచ్చింది.  అలాగే  20  ‘ప్రపంచపు అత్యుత్తమ ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ 2023’ జాబితాలో కూడా  విస్తారా 19వ ప్లేస్‌ కొట్టేసింది. అంతేనా ఆసియాలోని టాప్ 10 ఎయిర్‌లైన్స్ జాబితాలో విస్తారా 8వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. (రెండుసార్లు ఫెయిల్‌...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్‌ స్టోరీ)

ఎయిర్‌లైన్ స్కైట్రాక్స్ టాప్ 20 ఎయిర్‌లైన్స్ జాబితాలో వరుసగా రెండవ సారి స్థానం పొందింది విస్తారా.అలాగే వరుసగా మూడో ఏడాది కూడా  'బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా' అవార్డును,  ఇండియా దక్షిణాసియాలో ఉత్తమ  క్యాబిన్‌ క్రూ' గా వరుసగా ఐదవసారి, 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' మూడవసారి గెలుచుకుంది. దీంతోపాటు  'వరల్డ్స్ బెస్ట్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ 2023' విభాగంలో 20వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 100  దేశీల నుంచి వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో ఓటు వేయగా, మొత్తం 20.23 మిలియన్ల ప్రయాణికుల నుండి ఓట్లు వచ్చాయి.విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ ఈ  అవార్డులు తమ సేవలు, కస్టమర్ల నమ్మకంతో పాటు   వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమని మరింత ఉత్తేజితం చేస్తామన్నారు. తమ  ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ టీమ్‌లు, ఎనిమిదేళ్ల ప్రస్థానంలో విశేష కృషికి గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇండియా సౌత్‌ఏసియాలో ఉత్తమ విమానయాన సిబ్బంది అవార్డును ఐదోసారి గెలుచుకోవడం గొప్ప విషయమని స్కైట్రాక్స్  సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ అన్నారు.  (రిలయన్స్‌ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ)

విస్తారా
విస్తారా  టాటా సన్స్ , సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్  జాయింట్ వెంచర్. ప్రస్తుతం  ఇది 61 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది, ఇందులో 46 ఎయిర్‌బస్ A320neo, 10 ఎయిర్‌బస్ A321, ఒక బోయింగ్ 737-800NG, నాలుగు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top