అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?

Ultraviolette F77 Electric Bike Teased, India Launch This Year - Sakshi

ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఒక లెక్క నేను ఒక లెక్క అంటుంది ఈ బెంగళూరు ఈవీ స్టార్టప్ కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో హీట్ పెంచుతున్న తరుణంలో ఈ పోటీలో చేరడానికి అల్ట్రావయొలెట్ కంపెనీ నేను కూడా సిద్దం అంటుంది. అల్ట్రావయొలెట్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావయొలెట్ ఎఫ్77ను 2022 తొలి త్రైమాసికంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌గా అల్ట్రావయొలెట్ ఎఫ్77 నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌కి సంబంధించిన సరికొత్త టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ బైక్ మూడు వేరియెంట్లలో(Lightning, Shadow, Laser) లభిస్తుంది. దీనిలో 5.0 అంగుళాల కలర్ టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్, మూడు రైడింగ్ మోడ్‌లు, ఎల్టిఈ కనెక్టివిటీ, బైక్ నావిగేషన్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, రిమోట్ వేహికల్ వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో మాడ్యులర్ బ్యాటరీ టెక్నాలజీ, 90 ఎన్ఎమ్ ఆల్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ టెక్నాలజీ ఉంటుంది.

ఎఫ్77 బైక్ 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 140 కిలోమీటర్ల వేగం అని ఆటోమేకర్ పేర్కొంది. అల్ట్రావయొలెట్ ఎఫ్77ను ఒకసారి చార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఎఫ్77 బైక్ ఏసీ, డీసీ ఛార్జింగ్ రెండింటికీ సపోర్ట్ చేయడానికి సీసీఎస్ టైప్-2 ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో బైక్ బ్యాటరీని 50 నిమిషాల్లో 0 శాతం నుంచి 80 శాతానికి, 90 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. స్టాండర్డ్ ఛార్జర్ సహాయంతో బ్యాటరీ 3 గంటల్లో 80 శాతం, 5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది.

(చదవండి: 'జాక్‌ పాట్‌' అంటే ఇదేనేమో! యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ శాలరీ ఎంతంటే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top