Tim Cook Earnings: 'జాక్‌ పాట్‌' అంటే ఇదేనేమో! యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ శాలరీ ఎంతంటే!

Apple Ceo Tim Cook Earned Rs700 Crore Per Year - Sakshi

ప్రముఖ టెక్‌ కంపెనీల్లో పనిచేసే సీఈఓల శాలరీ ఎంతుంటుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. కొన్ని కంపెనీలు సీఈఓల జీతభత్యాల గురించి బహిరంగంగా చర్చించవు.అందుకు కారణాలు వేరే ఉన్నాయి..ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ 'జీరో శాలరీ'తో షేర్ల ద్వారా తన బిలియన్‌ డాలర్ల దాహం తీర్చుకుంటున్నారు.

లిథియమ్‌ మెటల్‌ బ్యాటరీలపై పరిశోధనలు నిర్వహించే అమెరికన్‌ స్టార్టప్‌ 'క్వాంటమ్‌స్కేప్‌ కార్పొరేషన్‌' సీఈఓగా భారత సంతతికి చెందిన జగ్దీప్‌ సింగ్‌ కు కంపెనీ శాలరీ రూపంలో కాకుండా వాటాల రూపంలో షేర్లను కట్టబెట్టినట్లు కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. వాటి విలువ అక్షరాల మన కరెన్సీలో 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది.

మరి యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? 

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఏడాదికి రూ.733 కోట్లు తీసుకుంటున్నారని సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) తెలిపింది. అదనంగా సెక్యూరిటీ, ప్రైవేట్‌ జెట్‌ వంటి సౌకర్యాల్ని యాపిల్‌ కల్పిస్తున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.  

సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ ప్రకారం.. కుక్‌ బేసిక్‌ శాలరీ సంవత్సరానికి రూ.89.20 కోట్లు ఉండగా.. ఎన్నిరాన్‌ మెంటల్‌ సస్టైనబులిటీ గోల్స్‌ (ఆఫీస్‌, ఉద్యోగుల కోసం) కింద రూ.10.33 కోట్లు 


 
ప్రైవేట్‌ జెట్‌ కోసం రూ. 5,29,66,072.92 కోట్లు 

సెక్యూరిటీ కోసం రూ.4,68,80,781.95 కోట్లు 

విహార యాత్రల కోసం రూ.17,15,534.95 కోట్లు  

ఎంప్లాయి రిటైర్మెంట్‌ ప్లాన్‌ కింద (401(k) plan) రూ.12,93,509.04 కోట్లు 

స్టాక్స్‌ అవార్డ్‌ కింద రూ.6,133.02కోట్లు 

2021లో యాపిల్‌ భారీ లాభాల్ని గడించినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. వరల్డ్‌ వైడ్‌గా లాక్‌డౌన్, కోవిడ్ విజృంభించినా యాపిల్‌ అమ్మకాలు వృద్దుతంగా జరిగినట్లు ఎస్‌ఈసీ తన నివేదికలో పేర్కొంది. ఆపిల్ సుమారు 33 శాతం ఆదాయ వృద్ధితో పాటు అమ్మకాలలో  రూ.27,130.47 కోట్లని నివేదించింది.

చదవండి: జాక్‌పాట్‌ కొట్టాడు! ఏకంగా 15వేల కోట్ల రూపాయల ప్యాకేజీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top