తాజాగా నిధుల సమీకరణ పూర్తి చేసిన ధూత్ టాన్స్‌మిషన్, మాల్బయో డయాగ్నస్టిక్స్ షేర్లు ఘనంగా అరంగేట్రం చేశాయి. ఇష్యూ ధరలతో పోలిస్తే రెండు కంపెనీలు 28%, 36% చొప్పున లాభాలు పంచాయి.
ధూత్ ట్రాన్స్‌మిషన్: ఇష్యూ ధర(రూ.871)తో పోలిస్తే బీఎస్‌ఈలో 37% ప్రీమియంతో రూ.1,194 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 39% పెరిగి రూ.1,213 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 36% లాభంతో రూ.1,187 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.24,290 కోట్లకు చేరింది.
మాల్బయో డయాగ్నస్టిక్స్: ఇష్యూ ధర (రూ.807)తో పోలిస్తే బీఎస్‌ఈలో రూ.980 వద్ద 21 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఒక దశలో రూ.1,064 వరకు ఎగబాకింది. చివరకు 28% లాభపడి రూ.1,036 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11,942 కోట్లుగా నమోదైంది.


