Twitter Layoffs: ట్విట్టర్‌ ఉద్యోగులకు భారీషాక్‌, ఎలన్‌ మస్క్‌ ఎంత పనిచేశావయ్యా!

Twitter Lays Off Over 100 Employees From Its Hr Team - Sakshi

సంస్థ ఉద్యోగులకు మైక్రో బ్లాగింగ్‌ దిగ్గజం ట్విట్టర్‌ భారీషాక్‌ ఇచ్చింది. ఆర్ధిక మాద్యం నేపథ్యంలో కాస్ట్‌ కటింగ్‌ తగ్గించుకునేందుకు ట్విట్టర్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల్ని తొలగించింది.   

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత ఆ సంస్థలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందుకు నిదర్శనంగా తాజాగా హెచ్‌ఆర్‌ విభాగానికి చెందిన టాలెంట్‌ అక్విజేషన్‌ టీంకు చెందిన 30 శాతం మంది ఉద్యోగుల్నిపక్కన పెట్టింది. ట్విట్టర్‌ సైతం 100 మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. 

అప్పుడే హింట్‌ ఇచ్చాడు
ఎలన్‌ మస్క్ జూన్‌లో ట్విట్టర్ ఉద్యోగులతో తన మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల తొలగింపు ఉంటుందా (టెస్లా ఉద్యోగుల తొలగింపును ఉద్దేశిస్తూ) అని ఉద్యోగులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మస్క్‌ స్పందించారు. సంస్థ "ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది" ఖర్చును సైతం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఖర్చులు.. సంస్థకు వచ్చే ఆదాయానికి మించి పోయాయి అని వ్యాఖ్యానించాడు. 

నో సీనియర్‌
తొలగింపులపై ట్విట్టర్‌ మాజీ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ టెక్నికల్ రిక్రూటర్‌గా పనిచేసిన ఇంగ్రిడ్ జాన్సన్..లింక్డ్ఇన్‌లో పోస్ట్‌లో ఈ విధంగా స్పందించారు. సంస్థ తీసుకున్న నిర్ణయంతో చాలా సంవత్సరాలుగా కంపెనీకి సేవలందించిన ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ట్విట్టర్ తొలగింపులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఒక దశాబ్దానికి పైగా అక్కడ ఉన్నఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇది నిజంగా కఠినమైన రోజు అంటూ విచారం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top