టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్ హఠాన్మరణం

బెంగళూరు: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ (64) కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారని కిర్లోస్కర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. (డీఎల్‌ఎఫ్‌కు షాక్: అదానీ చేతికి ‘ధారావి’ ప్రాజెక్టు)
బెంగళూరులోని హెబ్బాళ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించ నున్నారు. చివరిసారిగా నవంబర్ 25వతేదీన ముంబైలో జరిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రమ్ కిర్లోస్కర్ పాల్గొన్నారు. కిర్లోస్కర్ అకాల మరణంపై పలువురు బిజినెస్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
మరిన్ని వార్తలు :