నాలుగు దశాబ్దాల తర్వాత.. స్వదేశీ ట్యాగుతో ‘థమ్స్​ అప్’​ అరుదైన ఘనత

Thums Up: Made In India Brand Finally Becomes Billion Dollar Brand - Sakshi

నిదానమే ప్రధానం అనే నానుడి శీతల పానీయ బ్రాండ్​ థమ్స్​ అప్​కు సరిగ్గా సరిపోతుంది. ప్యాకేజ్డ్​ డ్రింక్స్​ మార్కెట్​లో నెమ్మదిగా.. స్థిరంగా వ్యాపారవృద్ధిని సాధించుకుంటూ వస్తున్న థమ్స్​ అప్​ ఇప్పుడు అరుదైన ఫీట్​ సాధించింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ‘బిలియన్​ డాలర్ల బ్రాండ్’​ ఘనత ఎట్టకేలకు దక్కింది.
 
1977లో కోలా కింగ్ రమేష్​ చౌహాన్​ థమ్స్​ అప్​ శీతల పానీయ బ్రాండ్​ను ప్రారంబించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత ​ బేవరేజెస్ మార్కెట్​లో  దీని హవా కొనసాగుతోంది. స్వదేశీ బ్రాండే అయినప్పటికీ ప్రస్తుతం ఇది కోకా కోలా కింద ఉంది. ​అయితే కిందటి ఏడాది అమ్మకాల్లో (2021)లో బిలియన్ డాలర్ మార్క్​ను(7,500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్​) దాటేసింది థమ్స్​ అప్​.

 

గ్లోబల్​ బేవరేజెస్​ మార్కెట్​లో బిలియన్​ డాలర్ల మార్కెట్​ ఉన్న కంపెనీలు చాలా ఉన్నా.. థమ్స్​ అప్​ ఈ మార్క్​ను స్వదేశీ ట్యాగ్​తో అందుకోవడమే ఇక్కడ కొసమెరుపు. ‘‘మా స్థానిక థమ్స్ అప్ బ్రాండ్ మార్కెటింగ్​ ప్రణాళిక, సరైన ఐడియాలతో భారతదేశంలో బిలియన్-డాలర్ల బ్రాండ్‌గా అవతరించింది. థమ్స్ అప్ ఇప్పుడు భారతదేశంలో బిలియన్ డాలర్ల బ్రాండ్” అని కోకా కోలా కంపెనీ CEO జేమ్స్ క్విన్సీ గర్వంగా ప్రకటించుకున్నారు.

స్వదేశీ తయారీ కూల్​ డ్రింక్​ అయిన థమ్స్ అప్​ను 1993లో కోకాకోలా సొంతం చేసుకుంది. పార్లే బిస్లరీ వ్యవస్థాపకుడు, ఇండియన్​ కోలా కింగ్​ రమేష్ చౌహాన్ నుంచి ఈ బ్రాండ్​ను కొనుగోలు చేసింది కోకా కోలా. థమ్స్​ అప్​తో పాటు మాజా, ఆ టైంలో సూపర్​ హిట్​ అయిన కూల్​ డ్రింక్​ బ్రాండ్​ గోల్డ్ స్పాట్​ను సైతం కొనుగోలు చేసేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top