ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్‌ సునామీ?

Tech Layoffs Surpasses 2008 Great Recession Level - Sakshi

ఐటీ జాబ్స్‌! యువతకు డ్రీమ్‌ డెస్టినేషన్‌. భారీ వేతనాలు, వారంలో రెండు రోజుల సెలవులు, ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే కొత్త ఇల్లు సహా.. ఏదైనా కొనగలిగే సమర్ధత. ఈఎంఐ సౌకర్యంతో ఏదైనా కొనేసే ఆర్ధిక స్థోమత. మొత్తంగా ఐటీ ఉద్యోగం అంటే లైఫ్‌ సెటిల్‌ అన్న ఫీలింగ్‌. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆర్ధిక నిపుణుల అంచనాల కారణంగా స్టార్టప్స్‌ నుంచి దిగ్గజ టెక్‌ కంపెనీల వరకు ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. 

ఇప్పటికే చిన్న, పెద్ద, మధ్య తరహా సంస్థలు ఈ ఏడాదిలో లక్షల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. గతేడాది టాప్‌ టెక్‌ దిగ్గజ సంస్థలైన ట్విటర్‌, యాపిల్‌, మెటాతో పాటు ఇతర కంపెనీలు వందల మందిని ఫైర్‌ చేశాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్లేస్‌మెంట్‌ సంస్థ ఛాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది 965 సంస్థలు లక్షా 50 వేల మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేసినట్లు తేలింది. వచ్చే ఏడాదిలో ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచిత్రంగా ప్రస్తుతం తొలగింపులు 2008-09లో తలెత్తిన ఆర్ధిక మాద్యం వల్ల పోగొట్టుకున్న ఉద్యోగాల కంటే ఎక్కువగా ఉంది. 

2018లో టెక్ కంపెనీలు 65,000 మంది ఉద్యోగులను తొలగించాయని, 2019లో కూడా అదే సంఖ్యలో టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారని సంస్థ గత నివేదికలు తెలిపాయి.కోవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి సుమారు 1400 టెక్ కంపెనీలు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఫైఐ డేటా వెల్లడించింది. 2022 టెక్ రంగానికి అత్యంత చెత్త సంవత్సరంగా కాగా...2023 ప్రారంభంలో టెక్ పరిశ్రమ మరింత అధ్వాన్నంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. నవంబర్ మధ్య నాటికి, మెటా, ట్విటర్, సేల్స్‌ ఫోర్స్‌ , నెట్‌ఫ్లిక్స్‌ తో పాటు ఇతర టెక్ కంపెనీలు యుఎస్ టెక్ రంగంలో 73,000 మందికి పైగా సిబ్బందని  తొలగించగా.. భారత్‌లో 17000 మందికి పైగా ఉపాధి కోల్పోయారు.

 

టెక్‌ విభాగంలో తొలగింపులు సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రారంభమై సంవత్సరం పొడవునా కొనసాగుతాయి. 2023 మొదటి అర్ధభాగంలో టెక్ తొలగింపులు మరింత దిగజారుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. మెటా, అమెజాన్, ట్విటర్, నెట్ ఫ్లిక్స్ సహా అనేక పెద్ద టెక్ కంపెనీలు ఇప్పటికే 2022 వరకు వందలు, వేల మంది తొలగించాయి. ట్విటర్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఇతర టెక్ కంపెనీలు ఇప్పటికే తొలగించగా.. గూగుల్ వంటి కంపెనీలు రాబోయే నెలల్లో దాదాపు వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top