అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి.. | TDS deducted but not filed ITR You may soon receive income tax notice | Sakshi
Sakshi News home page

అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..

Published Sun, Feb 4 2024 4:44 PM | Last Updated on Sun, Feb 4 2024 4:50 PM

TDS deducted but not filed ITR You may soon receive income tax notice - Sakshi

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్‌ కట్‌ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది.

కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్‌ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement