2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు

Tata Motors Plans To Bring 10 New EVs in Domestic Market By 2025 - Sakshi

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2025 నాటికి భారతీయ వాహన రంగంలోకి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్‌ అందించే ప్రపంచ అగ్రగామి సంస్థల్లో టాటా మోటార్స్‌ ఉండేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశంతో పాటు ఐరోపాలో సెల్, బ్యాటరీ తయారీ కోసం పలు ఒప్పందాలను చేసుకుంటున్నట్లు వివరించారు. టాటా మోటార్స్ గత సంవత్సరం ప్రారంభించిన నెక్సన్ ఈవీ 4,000 యూనిట్లను విక్రయించింది.

"రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఈవీ అమ్మకాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. టాటా మోటార్స్ భారత మార్కెట్లో ఈ మార్పుకు నాయకత్వం వహిస్తుంది. 2025 నాటికి, టాటా మోటార్స్ 10 కొత్త బీఈవీ వాహనాలను మార్కెట్లోకి తీసుకొనిరావలని యోచిస్తుంది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి మేము పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము" అని కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్ 2020-21 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలిపారు. టాటా గ్రూప్ భారతదేశం, ప్రపంచ వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను వేగంగా తీసుకొనిరావడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాగ్వార్ 2025 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ వాల్యూమ్ లలో 60 శాతం 2030 నాటికి పూర్తి బీఈవీ వాహనాలుగా మారతాయి అని అన్నారు.

చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top