
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy).. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భాగస్వామ్యంతో దేశంలోని 20 రాష్ట్రాలలో 100 రైల్వే స్టేషన్లకు తన సేవలను విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
నిజానికి రైలు ప్రయాణం అనేది.. భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. ఈ ప్రయాణంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్లలో స్విగ్గీ ఫుడ్‌ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ఎక్కువ సౌలభ్యంగా ఉంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా విభిన్న రకాల భోజనాలను రుచి చూసే అవకాశం లభించిందని.. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు.
స్విగ్గీ 2024 మార్చిలో ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత.. సీటుకు గ్యారెంటీ డెలివరీ (లేదా పూర్తి వాపసు) ప్రకటించింది. తాము ఎక్కడైతే ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నారో.. ముందు స్టేషన్‌లోనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అప్పుడు తాము చేరుకునే సమయానికి ఫుడ్ డెలివరీ అవుతుంది. జొమాటో కూడా ఈ తరహా ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఈ రెండు సంస్థలు రోజుకు లక్ష కంటే ఎక్కువ ఫుడ్ డెలివరీలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment