సాక్షి మనీ మంత్ర: జీవితకాల గరిష్ఠాలకు దగ్గర్లో మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: జీవితకాల గరిష్ఠాలకు దగ్గర్లో మార్కెట్‌ సూచీలు

Feb 8 2024 9:49 AM | Updated on Feb 8 2024 10:31 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 21,974 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 117 పాయింట్లు లాభపడి 72,266 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌ గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, విప్రో, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌​ బ్యాంక్‌, టాటా స్టీల్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ, మారుతిసుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతిఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 0.40 శాతం పెరిగి 79.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌ఐఐలు బుధవారం రూ.1,691.02 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.327.73 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement