లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. బ్యాంక్‌ షేర్లదే హవా... | Stock Market close highlights June 9th 2025 Sensex Nifty | Sakshi
Sakshi News home page
breaking news

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. బ్యాంక్‌ షేర్లదే హవా...

Jun 9 2025 3:55 PM | Updated on Jun 9 2025 4:18 PM

Stock Market close highlights June 9th 2025 Sensex Nifty

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. లండన్ లో యూఎస్-చైనా వాణిజ్య చర్చలకు ముందు సానుకూల ప్రపంచ సెంటిమెంట్, బలమైన యూఎస్ ఉద్యోగాల డేటా, యూఎస్-ఇండియా వాణిజ్య చర్చల పురోగతి వంటి అంతర్జాతీయ అంశాలతో పాటు ఆర్బీఐ బలమైన ద్రవ్య విధాన చర్యల మద్దతుతో భారతీయ ఈక్విటీ బెంచ్‌ మార్క్‌ సూచీలు సానుకూలంగా చలించాయి. 

ఇంట్రాడేలో 82,669 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 256.22 పాయింట్లు (0.31 శాతం) పెరిగి 82,445.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 100.15 పాయింట్లు లేదా 0.4 శాతం లాభపడి 25,103.20 వద్ద ముగిసింది. రంగాలవారీగా చూస్తే రియల్టీ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనార్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటీ, ఎనర్జీ 1 శాతానికి పైగా పెరిగాయి.

సెన్సెక్స్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.  అదేసమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.

విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.13 శాతం, 1.57 శాతం లాభాలతో ముగిశాయి. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.43 శాతం పెరిగి 14.69 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement