దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన తరువాత చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రెండవ సెషన్ లో ఎగిశాయి.
నిఫ్టీ 1.72 శాతం లేదా 392.70 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద, సెన్సెక్స్ 1.63 శాతం లేదా 1,205 పాయింట్లు పెరిగి 75,273.45 వద్ద ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్‌లో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance), అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), ట్రెంట్ (Trent), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) వంటి షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. మరోవైపు, ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి లోనవ్వడంతో టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రధానంగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీనితో పాటు పవర్ గ్రిడ్ (Power Grid), టీసీఎస్ (TCS) వంటి షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి.
విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.30 శాతం, 2.59 శాతం పెరిగాయి
రంగాల వారీగా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ గెయినర్ గా నిలిచాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ కూడా తమ సహచరులను అధిగమించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది.


