గోల్డ్‌ కంటే గోల్డ్‌ బాండ్లు బెటరా? చివరి తేది.. దరఖాస్తు విధానం..

Sovereign Gold Bond Opens On 12 February To 16 Issue Price 6263 Rs - Sakshi

బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఫిజికల్ గోల్డ్‌తో పాటు అంతే విలువ గల సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ)లను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎస్‌జీబీ గోల్డ్‌ కోసం ఈ నెల 12 నుంచి 16 వరకు దరఖాస్తు  చేసుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అవకాశం కల్పించింది.

భౌతిక బంగారంతో పోలిస్తే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్‌బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి. చోరీ భయం అసలే ఉండదు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్‌ బాండ్లను పరిశీలించొచ్చు.

20 కిలోల వరకూ కొనుగోలు

గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ గడువు ఎనిమిదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి. 

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4

భారత ప్రభుత్వం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌పై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఈ బాండ్స్‌ కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి  భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది. ఆర్బీఐ ఇష్యూ చేసిన ధర యూనిట్‌కు రూ.6,213గా ఉంది.

ఎక్కడ కొనుగోలు చేయాలంటే.. 

కమర్షియల్‌ బ్యాంకుల్లో ఈ సావరిన్‌ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), క్లియర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సీసీఐఎల్‌), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్ఛేంజ్‌ సంస్థలు అంటే నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌లలో కొనుగోలు చేయొచ్చు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు విధానం..

  • నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్‌ అవ్వాలి.
  • మెనూలో ఈ-సర్వీసెస్/ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సెక్షన్‌లో ‘సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌’ ఆప్షన్‌ క్లిక్‌చేయాలి. 
  • షరతులు, నియమాలు చదివి ప్రొసీడ్‌పై నొక్కాలి.
  • సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌కు అవరమైన వివరాలు అందులో నమోదు చేసి డిపాజటరీ పార్టిసిపేట్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా సీడీఎస్‌ఎల్‌)ను ఎంచుకోవాలి.
  • అనంతరం రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ సబ్మిట్‌ చేయాలి.
  • రిజిస్ట్రేషన్‌ తర్వాత పర్చేజ్‌ ఆప్షన్‌ వస్తుంది.

ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల సంచలన నిర్ణయం

  • మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఎంటర్‌ చేయాలి.
  • తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడంతో ప్రక్రియ ముగుస్తుంది. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top