మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!

Sidhu moose wala earn after his death - Sakshi

ప్రముఖ పంజాబీ సింగర్ 'సిద్దూ మూసేవాలా' (Sidhu Moosewala) దుండగులు చేతిలో దుర్మరణం పాలైన విషయం అందరికి తెలిసిందే. అయితే అతని పాటలు అతని మరణానంతరం కూడా భారీగా సంపాదిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 7న సిద్దు కొత్త సాంగ్ రిలీజ్ అయింది. యూట్యూబ్ ఛానల్‌లో విడుదలైన ఈ పాట కేవలం ఐదు గంటల్లో ఐదున్నర మిలియన్స కంటే ఎక్కువ వ్యూస్ పొందగలిగింది.

29 సంవత్సరాల వయసులో సిద్ధు మూసేవాలా మరణించినప్పటికీ అభిమానుల ఫాలోయింగ్‌తో ఇప్పటికీ తన యూట్యూబ్ రాయల్టీలు, డీల్‌ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. ప్రస్తుతం అతని ఆస్తులన్నీ కూడా వారి తల్లిదండ్రులకు బదిలీ చేశారు. సిద్దు మరణించే నాటికి ఆయన ఆస్తుల విలువ సుమారు 14 మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు వంద కోట్లకంటే ఎక్కువ.

సిద్ధు మూసేవాలా ఖరీదైన కార్లు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆయన లైవ్ షోలు, కచేరీ వంటి వాటి కోసం సుమారు రూ. 20 లక్షలు, బహిరంగ ప్రదర్శనలకు రూ. 2 లక్షల కంటే ఎక్కువ వసూలు చేసేవాడని కూడా తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ అమ్మబోతున్న అంబానీ: కొత్త రంగంలో రిలయన్స్ అడుగు..)

అతి చిన్న వయసులోనే ప్రఖ్యాత గాయకుడిగా ప్రసిద్ధి చెందిన సిద్ధు.. యూట్యూబ్ ఛానల్ మరణానంతరం కూడా సంపాదిస్తోంది. యూట్యూబ్ పాలసీల ప్రకారం వ్యూవ్స్ ఆధారంగా రాయల్టీలు అందిస్తుంది. అంటే ఏదైనా వీడియో లేదా పాట 1 మిలియన్ వ్యూస్ పొందితే యూట్యూబ్ 1000 డాలర్లను అందిస్తుంది.

ఇటీవలే విడుదలైన సిద్ధూ మూసేవాలా కొత్త పాట 18 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. దీంతో ప్రస్తుతానికి యూట్యూబ్ దీనికి రూ. 14.3 లక్షలు అందించాల్సి ఉంది. ఇది మరింత ఎక్కువ వ్యూస్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా స్పాటిఫై, వింక్, ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి అడ్వర్టైజ్‌మెంట్ డీల్స్ & రాయల్టీల ద్వారా సిద్ధూ మూసేవాలా తన మరణానంతరం తన పాటల ద్వారా రూ. 2 కోట్లకు పైగా సంపాదించాడు.

ఇటీవల విడుదలైన వీడియోలో సిద్దు మూసేవాలా గాత్రానికి నైజీరియన్ సింగర్ బర్నా బాయ్ రాప్ అందించారు. ఈ వీడియోలో మొత్తం సిద్దు మూసేవాలాకి ఏర్పడిన ఒక మంచి ఫేం, అలాగే ఆయనకు వచ్చిన మంచి పేరుతో సిటీలో ఎక్కడపడితే అక్కడ ఆయనకు ఏర్పాటు చేసిన కటౌట్లు, బిల్ బోర్డుల గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా ఆయన అభిమానులు గోడలకు సిద్ధూ పిక్చర్లు పెయింట్ చేయడం, ఆయన ఫోటోలు గోడలకు అతికించడం, వాహనాలకు అతికించడం వంటివి కూడా చూడవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అద్భుతమైన టెక్నాలజీతో సిద్దు మూసే వాలా కూడా కనిపించినట్లుగా మ్యాజిక్ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top