Royal Enfield Hunter 350: అమ్మకాల్లో ఇది రాయల్ బండి

Royal enfield hunter 350 one lakh sales - Sakshi

భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'రాయల్ ఎన్‌ఫీల్డ్' గత సంవత్సరం 'హంటర్ 350' బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కంపెనీ ఇప్పటికి లక్ష యూనిట్లను విక్రయించింది. దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ ప్రకటించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్స్‌లో విక్రయించబడుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు, రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ మొదటి 50,000 యూనిట్లను విక్రయించడానికి నాలుగు నెలల సమయం పట్టింది, ఆ తరువాత కేవలం రెండు నెలల్లో మరో 50,000 యూనిట్లను విక్రయించింది.

హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి 20.2 బిహెచ్‌పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 114 కిమీ, కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ వెనుకవైపు ట్విన్ షాక్‌లను కలిగి పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 110/70-17 54P ఫ్రంట్, 140/70-17 66P రియర్ ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉండి, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది.

హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, ఫ్యాక్టరీ సిల్వర్, డాపర్ వైట్, డాపర్ యాష్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ అనే ఎనిమిది కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్‌బేస్ కలిగి 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది. కంపెనీ అమ్మకాలలో ఇప్పటికే ఇది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top