మెగా రిపబ్లిక్ డే సేల్స్‌.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ షాపింగ్‌పై భారీ ఆఫర్స్‌

Republic Day Shopping Mega Sales offers - Sakshi

ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. రిపబ్లిక్ డే మెగా సెల్స్ సందడి

ఎలక్ట్రానిక్స్ నుంచి ఎయిర్ టికెట్స్ వరకు

ఆఫ్‌లైన్ అయినా.. ఆన్‌లైన్ అయినా..

భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న కంపెనీలు

దసరా, దీపావళి, న్యూ ఇయర్.. ఇలా పండుగలు వస్తున్నాయంటే చాలు.. షాపింగ్ జోరు మొదలైపోతుంది. ఆఫ్‌లైన్ అయిన ఆన్‌లైన్‌ అయినా.. మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాల్సిందే. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించేస్తాయి. అయితే.. ఈసారి రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎయిర్ టికెట్స్ వరకూ భారీ ఆఫర్స్ అందిస్తున్నాయి పలు దిగ్గజ కంపెనీలు.

వరల్డ్ టాప్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఈ నెల 15 నుంచి 20 వరకూ రిపబ్లిక్ డే మెగా సేల్స్ నిర్వహించింది. మొబైల్స్, స్మార్ట్ వాచెస్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఇచ్చింది. ఇక ఫ్లిప్‌కార్ట్  కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది.

కేవలం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్సే కాదు.. ఆఫ్‌లైన్‌లోనూ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ అంటూ భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి దిగ్గజ కంపెనీలు. టూ విలర్ కొనుగోలుదారులకు రూ.5 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది బజాజ్ సంస్థ. అంతేకాదు.. వినియోగదారులకు సులభ వాయిదాలు కూడా అందిస్తోంది. 

విజయ్ సేల్స్ కూడా మెగా రిపబ్లిక్ డే సేల్ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తోంది. గాడ్జెట్స్, గృహోపకరణాలు వంటి వస్తువులపై 65 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకుంటున్నారా..? అయితే.. ఇదే మంచి సమయం.. మా షోరూంలో భారీ డిస్కౌంట్స్ లభిస్తాయంటూ రిపబ్లిక్ సేల్స్‌ను ప్రారంభించింది క్రోమా సంస్థ. ఈ నెల 29 వరకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఆఫర్స్ ప్రకటించింది.

రిపబ్లిక్ డే సేల్స్ కేవలం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, గో ఆసియా సైతం.. టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా కేవలం రూ.1705 రూపాయలకే టికెట్లు విక్రయించింది. డొమెస్టిక్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.1199లకు.. ఇంటర్నేషనల్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.6599లకు అందిస్తోంది గో ఆసియా ఎయిర్ లైన్స్.

జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని మెగా సేల్స్, క్లియరెన్స్ సేల్స్ అంటూ భారీ డిస్కౌంట్లు ప్రకటించే సంస్కృతి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. అమెరికా ఇండిపెండెన్స్ డే అయిన జూలై 4 వచ్చిందంటే.. అక్కడ షాపింగ్ మాల్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోనూ మొదలైపోయింది. రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top