
బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఖాతాదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పొదుపు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు బ్యాంకింగ్ పద్ధతులకు పారదర్శకతను నిర్ధారించి, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
నిబంధనల్లోని ముఖ్యాంశాలు
వినియోగదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని సులభతరం చేయడం, బ్యాంకులను మరింత జవాబుదారీగా నిలిపేందుకు ఈ నిబంధనలు తోడ్పడుతాయని ఆర్‌బీఐ పేర్కొంది.
రోజువారీ వడ్డీ లెక్కింపు
పొదుపు డిపాజిట్లపై వడ్డీని నెలవారీ లేదా త్రైమాసికంగా కాకుండా ప్రతిరోజూ లెక్కించాలని ఆర్‌బీఐ తెలిపింది. ఇది తక్కువ డిపాజిట్లపై కస్టమర్లకు స్థిరంగా వడ్డీని సంపాదించేలా చేస్తుంది. ఇది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై స్పష్టత
మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే విధించే జరిమానాలను బ్యాంకులు స్పష్టంగా పేర్కొనాలి. ఇది హిడెన్ ఛార్జీలపై అనుమానాలను తొలగిస్తుంది. వినియోగదారులు వారి ఖాతాలకు సంబంధించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది.
ప్రామాణిక ఉచిత ఏటీఎం లావాదేవీలు
ఖాతాదారులు అన్ని బ్యాంకుల్లో ఒకే నిర్దిష్ట ఉచిత ఏటీఎం లావాదేవీలకు అర్హులవుతారు. ఉచిత పరిమితి ముగిసిన తర్వాత లావాదేవీలు చేయాలంటే ప్రామాణిక రుసుము వర్తిస్తుంది. ప్రత్యేకించి వివిధ బ్యాంకుల్లో బహుళ ఖాతాలు కలిగి ఉన్నవారికి ఇది స్పష్టతనిస్తుంది.
అకౌంట్ పోర్టబిలిటీని సరళీకృతం
ఆర్‌బీఐ సేవింగ్స్ ఖాతా పోర్టబిలిటీని అమలు చేయాలని చెప్పింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ మాదిరిగానే వినియోగదారులు తమ బ్యాంకు లేదా శాఖను ఇబ్బంది లేకుండా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది ఖాతాదారుల సౌకర్యాన్ని పెంచుతుంది. మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకుల మధ్య పోటీని పెంచుతుంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
కొత్త రూల్స్ ఎందుకు?
కొంతకాలంగా దేశంలో పొదుపు ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన వంటి ప్రభుత్వ చొరవలతో ఖాతాల సంఖ్య అధికమైంది. అయితే వడ్డీ లెక్కింపు, మినిమమ్ బ్యాలెన్స్ అవసరాలు, ఏటీఎం వినియోగ పరిమితులు, అకౌంట్ ఛార్జీలు వంటి అంశాలను వివిధ బ్యాంకులు నిర్వహించే విధానంలోని అసమానతలున్నాయి. వీటిలో ఏకరూపకత తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిచింది. ఈ అసమానతలను పరిష్కరించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిని అన్ని బ్యాంకులు పాటించాలి.
ఇదీ చదవండి: మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?