ఈ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లు పెరిగాయ్‌! | Sakshi
Sakshi News home page

ఈ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లు పెరిగాయ్‌!

Published Wed, Jan 10 2024 10:45 AM

PNB Hikes Fixed Deposit Rates - Sakshi

భద్రతతో కూడిన స్థిరమైన రాబడికి ఉత్తమమైన పెట్టుబడి మార్గం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. అందుకే వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్దిష్ట కాల వ్యవధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల టెన్యూర్‌పై ఎఫ్‌డీ రేటు సాధారణ ప్రజలకు గతంలో 6.25 శాతం ఉండగా 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్‌లకు 6.75 శాతం నుంచి 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.05 శాతం నుంచి 7.85 శాతానికి సవరించింది.

రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల లోపు 300 రోజుల టెన్యూర్‌ పీఎన్‌బీ ఉత్తమ్ (ముందస్తు ఉపసంహరణకు వీలులేని) ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లోనూ వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించింది. సాధారణ ప్రజలకు 6.30 శాతం నుంచి 7.10 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.80    శాతం నంచి 7.60 శాతానికి పెంచింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా 7.10 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది.

కొత్త ఎఫ్‌డీ రేట్లు జనవరి 8 నుంచి వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించిన తర్వాత ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు తమ ఎఫ్‌డీ రేట్లను సవరించాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement