
భారతదేశంలోని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం భారీగా తగ్గాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎదుర్కొంటుందని శనివారం వెల్లడించింది. దివాలా.. దివాలా కోడ్ సెక్షన్ 9 కింద బెంగళూరులోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఈ పిటిషన్‌ను సమర్పించారు.
ఆపరేషనల్ క్రెడిటర్ రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్, అందించిన సేవలకు చెల్లింపులలో డిఫాల్ట్ అయిందని ఆరోపించింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ వాదనలను ఖండించింది. దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామని, వాటాదారుల ప్రయోజనాల కోసం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు పతనమయ్యాయి.
దీంతో కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ఉదయం 10.25 గంటలకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 6.14 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకొని.. రూ. 47.41కి చేరుకున్నాయి. కొంతకాలంగా పతనమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూశాయి.