యువతకు ఉచిత శిక్షణ..3,474 మందికి ఉద్యోగాలు | NIIT Angel One launched a transformative program to enhancing employability | Sakshi
Sakshi News home page

యువతకు ఉచిత శిక్షణ..3,474 మందికి ఉద్యోగాలు

Jul 16 2024 12:10 PM | Updated on Jul 16 2024 12:24 PM

NIIT Angel One launched a transformative program to enhancing employability

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఐటీ), ఏంజెల్‌వన్‌ సంయుక్త భాగస్వామ్యంలో 3,474 మంది యువతకు ఉపాధి కల్పించినట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీఓ), బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వంటి రంగాల్లో నైపుణ్యాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన వారికి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

భారత్‌లో టెక్నాలజీపరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ యువతలో అందుకు తగిన నైపుణ్యాలు మెరుగవడం లేదు. దాంతో సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు సాధించడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024’ ప్రకారం..యువతకు కొలువులు దక్కకపోవడానికి ‍ప్రధానం కారణం సరైన విద్య, నైపుణ్యాలు లేకపోవడమేనని తేలింది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఎన్‌ఐఐటీ, ఏంజెల్‌వన్‌ బ్రోకింగ్‌ సంస్థ సంయుక్తంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 18-28 ఏళ్ల మధ్య వయసు గల యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను నేర్పిస్తున్నారు. లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్‌) ద్వారా శిక్షణా మాడ్యూళ్లను అందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ కోసం పురుషులతో పోలిస్తే 58% మంది మహిళలే అధికంగా తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం అభ్యర్థుల్లో 71% మంది (3,474 మంది లబ్ధిదారులు) క్వెస్‌ కార్ప్‌, సీ-టెక్‌, ఫిన్‌డ్రైవ్‌ సర్వీసెస్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌, డీబీఎస్‌ మింటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల్లో ఉద్యోగం పొందినట్లు ఎన్‌ఐఐటీ, ఏంజెల్‌ వన్‌ ప్రకటన విడుదల చేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల్లోని యువత ఈ కార్యక్రమంలో భాగమయ్యారని తెలిపాయి. 3,750 మందికి నైపుణ్యాలు అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement