Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!

New Airless Tires Just Hit Public Streets For the First Time From Michelin - Sakshi

వాహనాలకు మరింత వేగాన్ని, స్టెబిలిటీని అందించడంలో  టైర్లు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.సరియైన మోతాదులో టైర్లలో గాలి ఉంటే వాహనం ఎక్కువ పికప్‌ను అందుకుని వేగంగా వెళ్తుంది. సంప్రాదాయక టైర్లు ఎక్కువగా పంక్చర్‌ అవ్వడం చూసే ఉంటాం. వాటి స్థానంలో ట్యూబ్‌లెస్‌ టైర్లు మార్కెట్లలోకి వచ్చాయి. ట్యూబ్‌లెస్‌ టైర్లతో కాస్త ఉపశమనం కల్గిన అది కొంత సేపు వరకే మాత్రమే. ట్యూబ్‌లెస్‌ టైర్లు పంక్చర్‌ అయితే కొంత దూరం మేర వచ్చినా.. ఈ టైర్లు కచ్చితంగా పంక్చర్‌ ప్రూఫ్‌ మాత్రం కాదు. తిరిగి వాటికి పంక్చర్‌ చేయల్సిందే.  పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్ల కోసం అనేక కంపెనీలు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందించడంలో  మిచెలిన్‌ సంస్థ ముందుంది. తాజాగా మిచెలిన్‌ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను టెస్ట్‌ చేసింది. 
చదవండి: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌...!

3డీ ప్రింటింగ్‌తో...!
2005 నుంచి ప్రముఖ టైర్ల తయారీదారు మిచెలిన్‌ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లపై పనిచేస్తోంది. ఒక దశాబ్దకాలంపాటు చేసిన పరిశోధనల ఫలితంగా మిచెలిన్‌ పంక్చర్‌ ఫ్రూఫ్‌ టైర్లను రియాల్టీలోకి తెచ్చింది. భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్‌ వాహనాలకు  పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మిచెలిన్‌ భవిష్యత్తులో పర్యావరణానికి అనుకూలంగా ఉండే గ్రీన్‌ టైర్లను అందుబాటులోకి తీసుకురానుంది.  యూనిక్‌ పంక్చర్‌ప్రూఫ్ టైర్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌లెస్ టైర్, పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందించనుంది. 3 డీ ప్రింటింగ్‌తో తయారుచేసిన టైర్లను మిచెలిన్‌ అందుబాటులోకి తీసుకురానుంది.


ఫోటోకర్టసీ: మిచెలిన్‌ టైర్స్‌

మిచెలిన్‌ 2017లో పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్ల వీడియోను టీజ్‌ చేసింది. కంపెనీ డెవలప్‌ చేసిన టైర్లు గ్లాస్ ఫైబర్ రీఈన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్ తయారు చేయబడిన సౌకర్యవంతమైన లోడ్-బేరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇలాంటి టైర్లను మార్స్‌పైకి పంపిన రోవర్‌, క్యూరియాసిటీలో నాసా ఉపయోగించింది. ఈ టైర్లను 2024లోపు మార్కెట్లలోకి తీసురావాలని మిచెలిన్‌ భావిస్తోంది. తొలుత  రీసైకిలింగ్‌ చేయబడిన టైర్లనుపయోగించి పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను తయారు చేయనుంది. 
   

టైర్లతో పొంచి ఉ‍న్న ముప్పు...!
ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు బిలియన్లకు పైగా టైర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ టైర్ల జీవితకాలం దాటిన తర్వాత, ఈ టైర్లను నిర్వీర్యం చేస్తారు. అందులో కొన్ని టైర్లను రీసైకిలింగ్‌ చేయగా.. మిగతావి వ్యర్థాలుగా మిగిలిపోనున్నాయి. కొన్ని సందర్భాల్లో వాడి పడేసిన టైర్లు అగ్నిప్రమాదాలకు గురై.. వాతావరణంలో విషపూరిత వాయువులను వెదజల్లే అవకాశం ఉంది. 

చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top