
తపాలా శాఖతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఒప్పందం చేసుకుంది. పోస్టల్ శాఖకు చెందిన లక్ష మంది పోస్ట్‌మ్యాన్‌లకు మ్యూచువల్ ఫండ్స్‌పై శిక్షణ ఇవ్వనుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మ్యూచువల్ ఫండ్స్ సేవలను తపాలా శాఖ ద్వారా చేరువ చేయొచ్చన్నది యాంఫి లక్ష్యంగా ఉంది.
యాంఫి 30వ వ్యవస్థాపక దినం సందర్భంగా తపాలా శాఖ, యాంఫి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మ్యూచువల్ ఫండ్స్ సేవలపై అవగాహనను విస్తృతం చేసేందుకు గాను నివేష్ కా సహి కదమ్, భారత్ నివేష్ రైల్ యాత్ర తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా యాంఫి ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ క్యాంపుల నిర్వహణ, వందే భారత్ రైళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది.
ముఖ్యాంశాలు
లక్ష మంది పోస్ట్మ్యాన్లకు శిక్షణ: మొదటగా బిహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రారంభం.
మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లుగా శిక్షణ: ప్రతి జిల్లాలో కనీసం 10 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేలా లక్ష్యం.
భారత్ నివేష్ రైల్ యాత్ర & వందే భారత్ అవగాహన క్యాంపులు: మ్యూచువల్ ఫండ్స్‌పై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు.
నివేష్ కా సహి కదమ్: పెట్టుబడులపై సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రజలకు మార్గనిర్దేశం చేసే కార్యక్రమం.
B30 నగరాలపై దృష్టి: చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మ్యూచువల్ ఫండ్స్ విస్తరణకు ప్రాధాన్యత.
ఈ భాగస్వామ్యం ద్వారా, ఫైనాన్షియల్ లిటరసీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.
ఇదీ చదవండి: పదేళ్లలో వేలకొద్దీ కిలోల బంగారం సీజ్.. ఆర్థిక శాఖ లెక్కలు చూస్తే..