మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎంఎస్‌ఈఐ ఇండెక్స్‌ ఫండ్‌

Motilal Oswal MF launches MSCI EAFE TOP 100 fund - Sakshi

మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎంఎస్‌సీఐ ఈఏఎఫ్‌ఈ టాప్‌ 100 సెలక్ట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీనిద్వారా ఎంఎస్‌ఈఐ ఈఏఎఫ్‌ఈలో టాప్‌–10 దేశాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. యూరోప్, ఆస్ట్రేలియా తదితర 21 వర్ధమాన మార్కెట్ల వెయిటేజీతో ఎంఎస్‌సీఐ ఈఏఎఫ్‌ఈని ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి తీసుకొచ్చిన మొదటి ఇండెక్స్‌ ఫండ్‌ ఇదని, దీనివల్ల అంతర్జాతీయంగా ఉన్న చక్కని అవకాశాలను కోల్పోకుండా చూసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 15న మొదలై.. 25న ముగుస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top