ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా!

Published Thu, Jan 18 2024 4:57 PM

More Job Cuts Google This Year - Sakshi

గత ఏడాది పెద్ద కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలు, 2024లో అయినా పరిస్థితులు చక్కబడుతాయనుకుంటే ఇప్పటికే లేఆప్స్ మొదలైపోయాయి. జనవరి 1 నుంచి వివిధ కంపెనీలు 7500 మంది ఉద్యోగులను తొలగించాయి.

ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ సంస్థ ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. పనిభారాన్ని తగ్గించడానికి ఏఐ సాఫ్ట్‌వేర్ అండ్ ఆటోమేషన్‌ వంటి వాటిని అనుసరించనున్నట్లు, ఈ కారణంగా మరింత మంది ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం.

గూగుల్ ఇప్పటికే జెమిని' (Gemini) పేరుతో అడ్వాన్స్‌డ్‌ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇది తప్పకుండా భవిష్యత్తులో పనిభారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది కూడా ఈ ఏడాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి కారణమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: టీసీఎస్‌ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్!

ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులు గతేడాది మాదిరిగా అన్ని విభాగాల్లో ఉండే అవకాశం ఉండదని పిచాయ్ వెల్లడించారు. అయితే గత వారం సంస్థ తన వాయిస్ అసిస్టెంట్ యూనిట్‌లోని పిక్సెల్, నెస్ట్, ఫిట్‌బిట్‌కి బాధ్యత వహించే హార్డ్‌వేర్ టీమ్‌లు, అడ్వర్టైజింగ్ సేల్స్ టీమ్ & ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్‌లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement